ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వంతు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో నెం.1 మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. కేవలం తెలుగుకి పరిమితం కాకుండా తమిళంలోనూ సినిమాలు చేస్తున్నాడీ యువ సంగీత సంచలనం. తాజాగా దేవిశ్రీ కి తమిళం నుంచి మరో మంచి అవకాశం వచ్చింది. తెలుగులో విజయవంతమైన లక్ష్మీ నరసింహాకి ఒరిజనల్ వెర్షన్ అయిన సామికి సీక్వెల్గా ఇప్పుడు సామి 2 పేరుతో ఓ సీక్వెల్ తెరకెక్కుతోంది. హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. దీనికే దేవిశ్రీ సంగీతమందించబోతున్నాడు.
ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సామికి హేరిస్ జైరాజ్ సంగీత దర్శకుడు కాగా.. ఇప్పుడు సామి2కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నారు. ఇంతకుముందు హరి దర్శకత్వంలో రూపొందిన సింగం (యయుడు), సింగం 2 చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తే.. మూడో భాగం ఎస్ 3కి హేరిస్ జైరాజ్ సంగీతమందించాడు. అంటే దేవిశ్రీ ప్రసాద్ చేయాల్సిన సీక్వెల్ని హేరిస్ చేస్తే.. హేరిస్ చేయాల్సిన సామి 2ని ఇప్పుడు దేవిశ్రీ చేస్తున్నాడన్నమాట. ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్రసాద్ తాజా తెలుగు చిత్రం జై లవకుశ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com