Pawan Kalyan:ఇప్పుడు తెలంగాణలో పోరాడే రోజు వచ్చింది: పవన్ కల్యాణ్‌

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్‌లో రౌడీలను, గూండాలను ఎదుర్కొంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన టీ అభ్యర్థి సురేందర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని.. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని.. అందుకు జనసేన అండగా ఉంటుందన్నారు.

ఒకసారి కమ్యూనిస్టులతో ఉంటావ్.. మరోసారి బీజేపీతో ఉంటావ్... ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతావ్.. అసలు నీది ఏ ఇజం అని చాలామంది అంటుంటారన్నారు. అయితే తనది హ్యూమనిజమని స్పష్టంచేశారు. సోషలిజం, సనాతన ధర్మం రెండు కలిస్తే జనసేన అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కీర్తించిన దాశరథి కృష్ణమాచార్య గారు ఒకవైపు ఎర్ర జెండా పట్టి మరోవైపు వేదాలను తెలుగులోకి అనువదించిన వ్యక్తి అని.. ఆయనే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రధాని మోదీ సభలో తాను బీఆర్ఎస్ పార్టీని విమర్శించలేదని అంటున్నారని.. ఆంధ్రాలో లాగా ఇక్కడ పూర్తి స్థాయిలో తాను తిరగలేదని.. అందుకే తాను మాట్లాడలేదని గుర్తుచేశారు. కానీ జనసైనికులు, వీర మహిళలు పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారన్నారు. ఇప్పుడు అడిగే రోజు.. పోరాడే రోజు వచ్చిందన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 65 మంది సీఎంలు వస్తే.. 25 మంది బీసీలేనని అన్నారు. తెలంగాణలో జనసేన-బీజేపీ కూటమిని గెలిపించి బీసీ వ్యక్తిని సీఎంగా చేసుకుందామని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గద్దర్‌ను గుర్తు చేసుకుంటూ గద్దరన్న చనిపోయే ముందు తెలంగాణలో యువతకు అండగా ఉండాలని కోరారని.. గద్దరన్న ఆశయం కోసం నిలబడతానని పవన్ కల్యాణ్‌ మాట ఇచ్చారు.

More News

CM Jagan:సీఎం జగన్ సహా 41 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై

Dalari:అన్నదమ్ముల కథ , వ్యవస్థలో లోపాలను టచ్ చేసే ‘‘దళారి’’ .. మరో బలగం అవుతుందన్న సినీ ప్రముఖులు

రాజీవ్‌ కనకాల, షకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక నటీనటులుగా కాచిడి గోపాల్‌రెడ్డి రచన దర్శకత్వంలో

Dhootha : అక్కినేని నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ చూశారా.. క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో అదరహో

హిట్టు , ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగే నటుల్లో అక్కినేని వారసుడు నాగచైతన్య ఒకరు.

Bigg Boss Telugu 7 : ప్రశాంత్‌ను నమ్మించి బలి చేసిన శివాజీ.. శోభతో గొడవ , లాఠీ విసిరికొట్టిన అమర్‌దీప్ .. రతికతో గౌతమ్ లవ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 80 రోజులు  పూర్తి చేసుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది.

Yuvagalam Padayatra:ఈనెల 27న 'యువగళం' పాదయాత్ర పున:ప్రారంభం.. రూట్ మ్యాప్ ఖరారు..

టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.