ఇప్పుడు బుల్లితెర‌పై కూడా...

  • IndiaGlitz, [Saturday,September 08 2018]

కృష్ణ త‌న‌య‌.. మ‌హేశ్ సోద‌రి.. నిర్మాత.. ద‌ర్శ‌కురాలు అయిన మంజుల ఘ‌ట్ట‌మ‌నేని వెండితెర నుండి బుల్లితెర‌కు రావ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటంది. ఈమె ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఓ ప్ర‌ముఖ డిజిటల్ నెట్ వ‌ర్క్‌తో భాగ‌స్వామ్యం అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌బోతున్నార‌నేది స‌మాచారం.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివ‌రాలు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది చివ‌ర్లో ఈ వెబ్ సిరీస్ ప్రారంభం అవుతుంది ఆలోపు ప్ర‌శాంత్ వ‌ర్మ.. రాజ‌శేఖ‌ర్‌తో చేసే క‌ల్కి సినిమాను పూర్తి చేసుకుంటారు.