MLC By-Elections: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

  • IndiaGlitz, [Thursday,January 11 2024]

తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో ఇరువురు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వీరి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానాల భర్తీకి సీఈసీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ పదవుల పదవీ కాలం నవంబర్ 30, 2027 వరకు ఉండనుంది.

ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు..

జనవరి 18- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
జనవరి 19- నామినేషన్ల పరిశీలన
జనవరి 22- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
జనవరి 29- పోలింగ్‌, కౌంటింగ్‌

ఇక 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు కౌంటింగ్ జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

అయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేలతో భారీ మెజార్టీ ఉంది. విడివిడిగా ఎన్నికలు జరిగి ఉంటే ఒక్క స్థానం బీఆర్ఎస్‌ ఖాతాలోకి వెళ్లేది. కానీ ఒకేసారి ఎన్నికలు జరగనుండడంతో రెండు స్టానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాని నేతలతో పాటు ఓడిపోయిన నేతలు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు.

వీరిలో జగ్గారెడ్డి, మధుయాష్కీ, మైనంపల్లి హన్మంత్‌రావు, అంజనీకుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్, అద్దంకి దయాకర్ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. ఈ రెండు స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి అధిష్టానం ఎవరికీ ఛాన్స్ ఇస్తుందో వేచి చూడాలి.

More News

Vikram Goud: టీబీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక..!

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నేత దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Mohith Reddy: దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ పట్టలేదు.. చంద్రబాబు ఆరోపణలపై మోహిత్ రెడ్డి ఫైర్..

చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు చేర్పించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నిరూపిస్తే నామినేషన్‌ కూడా వేయనని తుడా చైర్మన్, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి

Kesineni Nani: కేశినేని నానిపై టీడీపీ నేతలు కౌంటర్ ఎటాక్.. వైసీపీ కోవర్టు అంటూ ఆరోపణలు..

టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సీఎం జగన్‌ను కలిసిన అనంతరం చంద్రబాబు

Traffic Challans: తెలంగాణ వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు..

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్ల గడువును ఈనెల 31వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేశినేని నాని, ఆయన కుమార్తె సీఎం జగన్‌ను కలిశారు.