సీఎం జగన్ కేసులో తెలంగాణ మంత్రికి నోటీసులు!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఇప్పటికీ ఇంకా తేలలేదు. ఇదివరకే పలుమార్లు సీబీఐ కోర్టు విచారించినప్పటికీ ఇంతవరకూ తేల్చలేదు. తనపై ఉన్న పిటిషన్లన్నీ ఒకేసారి విచారించాలని.. అంతేకాదు తాను సీఎం హోదాలో పదే పదే కోర్టుకు రావాలంటే రాలేనని మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ కోరినప్పటికి అస్సలు సమస్యే లేదని తేల్చిచెప్పింది. అయితే గత ఏడాది మార్చిలో కోర్టుకు హాజరైన జగన్.. ఇవాళ (శుక్రవారం) సీఎం హోదాలో హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఇటు జగన్ తరఫు న్యాయవాది.. అటు సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేయడం జరిగింది. ఇవాళ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ కూడా ఓ కేసు విషయంలో కోర్టుకు ఇవాళ హాజరుకావాల్సి ఉంది. అయితే కోర్టుకు వెళ్లారో లేదో తెలియదు.
మంత్రి, మాజీ మంత్రికి నోటీసులు!
ఇదిలా ఉంటే.. జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మితో పాటు రిటైర్డ్ అధికారులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు భూముల కేటాయింపు వ్యవహారంలో అవకతవకల విషయమై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా పలువురు అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 17న నిందితులు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఉన్న సంగతి తెలిసిందే. నాడు భూముల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ చార్జీషీట్‌ను దాఖలు చేసింది. నాటి నుంచి నేటి వరకూ ఈ కేసు సాగుతూనే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments