డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ హీరో తనీష్‌కు నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ ఇండస్ట్రీని ఇప్పుడప్పుడే డ్రగ్స్ మహమ్మారి వదిలేలా లేదు. టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇటీవలే సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ హీరో తనీష్‌కు బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ తనిష్‌తో పాటు ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త శంకర్ గౌడ, మరో ఐదుగురికి పోలీసులు సమన్లు జారీ చేశారు. నిర్మాత శంకర్ గౌడ ఇటీవల ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో దీనిలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు.
ఈ కేసులో మొదట ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి విచారించగా మొత్తం వ్యవహారం బయటపడినట్టు తెలుస్తోంది. సదరు విదేశీయులు ఇచ్చిన సమాచారంతో తనీష్ సహా ఐదుగురికి బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనీష్ మాత్రం తనకు ఏ నోటీసులు అందలేదని చెబుతున్నాడు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నానని తనీష్ వెల్లడించాడు. గతంలో కూడా తనీష్ సిట్ అధికారుల విచారణను ఎదుర్కొన్నాడు. 2017లో టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు సృష్టించిన సమయంలో.. ఈ కేసులో తనీష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు.
కాగా.. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తనీష్.. తరువాత హీరోగా కూడా బాగానే రాణించాడు. ఈ లోపే డ్రగ్స్ కలకలం రేపడం విచారణను ఎదుర్కోవడం చకచకా జరిగిపోయాయి. ‘బిగ్‌బాస్’ సీజన్ 2లో పాల్గొని తనీష్ టాప్ 5కు చేరుకున్నాడు. ఆ తరువాత అదే ‘స్టార్ మా’ లో బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు చేశాడు. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనీష్ కెరీర్ పీక్స్‌లో ఉంటుందని అంతా భావించారు. కానీ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరమే తనీష్ హీరోగా విడుదలైన ఓ సినిమా ఏమాత్రం ఆదరణకు నోచుకోలేదు. మళ్లీ ఇప్పుడు డ్రగ్స్ నోటీసులు.. ఇక తనీష్ కెరీర్ మున్ముందు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments