ఎట్టెట్టా... నోటా!

  • IndiaGlitz, [Thursday,May 02 2019]

'నోటా' అనే పేరు వినగానే గ‌తేడాది విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన బై లింగ్వుల్ చిత్రం అని అంద‌రికీ ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాను సూర్య క‌జిన్ జ్ఞాన‌వేల్ రాజా నిర్మించారు. ఈ సినిమా క‌థ వ‌ల్ల సూర్య సినిమా బాగా లేట‌యింది. అదెలాగా? అని ఆరా తీస్తే సూర్య ప్ర‌స్తుతం న‌టిస్తున్న 'ఎన్‌జికే' క‌థ‌, 'నోటా' క‌థ ఒకే ర‌కంగా ఉన్నాయ‌ట‌. సూర్య క‌జిన్ నిర్మిస్తుండ‌టంతో క‌థ తెలిసింద‌ట‌.

పైగా 'నోటా' గ‌తేడాది విడుద‌లైంది. సూర్య ఎన్.జి.కె కూడా గతేడాదే విడుద‌ల కావాల్సింది. కాక‌పోతే ముందు 'నోటా' విడుద‌ల కావ‌డం, స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో ఎన్‌.జి.కె. క‌థ‌ను మార్చాల్సి వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్న ఆ చిత్ర నిర్మాత చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే ఆయ‌న ఎక్క‌డా 'నోటా' అనే పేరును మాత్రం ప్ర‌స్తావించ‌లేదు.

ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే నిన్న‌టిదాకా త‌మిళ హీరోల చిత్రాల వ‌ల్ల తెలుగు సినిమాల‌కు ఏర్ప‌డిన ప‌లు ఇబ్బందుల గురించి విన్నాం. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మిళ ఎంట్రీనే ఓ పెద్ద స్టార్ హీరో సినిమాకు త‌ల‌నొప్పిగా మార‌డం త‌మిళ తంబిల‌కు పెద్ద‌గా మింగుడుప‌డ‌లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎన్.జి.కె.లో సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ క‌లిసి సూర్య ప‌క్క‌న క‌నిపిస్తారు. మే 31న ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

18న చ‌లో విజ‌య‌వాడ‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఈ నెల 18న 'చ‌లో విజ‌య‌వాడ‌' అని అన‌నుంది. ఇంత‌కీ తెలుగు ఇండ‌స్ట్రీ ఆ రోజు ఎందుకు వెళ్ల‌నుంది అనేగా అనుమానం. 'మ‌హ‌ర్షి' స‌క్సెస్‌మీట్ కోసం.

నిఖిల్ ఆ ప‌నుల్లో ఉన్నాడు 

'కార్తికేయ‌' చిత్రం గుర్తుంది క‌దా?  ద‌ర్శ‌కుడు చందు మొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. థ్రిల్ల‌ర్‌గా చాలా మందిని ఆక‌ట్టుకుంది. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురంలో జ‌రిగిన క‌థ‌తో ఈ సినిమా రూపొందింది.

త‌ల్లుల్ని లాగుతున్న నాయిక‌లు

సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్ పెరిగాక ఎవ‌రి నోటి వెంట ఏం వినాల్సి వ‌స్తుందో అన్న‌ట్టు త‌యారైంది ప‌రిస్థితి. అందులోనూ హీరోయిన్ల‌యితే మ‌రీ... ఎవ‌రేమ‌న్నా స‌రే...

మోదీ పై పిల్లలు అభ్యంతరక వ్యాఖ్యలు.. ప్రియాంక వీడియో వైరల్

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక ఈ వీడియో చూశారు.

హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు కలకలం

హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు కలకలం సృష్టించాయి. బస్సు నెంబర్ ఏపీ 28 జె 4468 బస్సులు కాల్పులు జరిగాయి. నగరంలోని పంజాగుట్ట దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.