వరుణ్ కాదు.. సాయిధరమ్ తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. తన తదుపరి చిత్రాన్ని ఓ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించేందుకు ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో సీనియర్ కథానాయకుడు వెంకటేష్ ఒక హీరోగా నటించనున్నాడని వార్తలు వినిపించాయి.
అయితే మరో కథానాయకుడిగా ఎవరు నటించనున్నారు? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఆ మధ్య యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటించే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ నటించేందుకు అంగీకరించాడని తెలిసింది.
ఇదివరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సుప్రీమ్ చిత్రంలో సాయిధరమ్ నటించిన సంగతి తెలిసిందే. అందుకే.. అనిల్ ఈ ప్రాజెక్ట్ విషయమై సంప్రదించగానే సాయిధరమ్ వెంటనే ఓకే చెప్పాడని సమాచారమ్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com