నాగచైతన్య కాదు.. సుమంత్
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యన్.టి.ఆర్ పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్‌లో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తుండగా.. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
వారిలో నాగచైతన్య కూడా ఉన్నారు. తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో చైతూ నటించే అవకాశముందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే.. ఇప్పటికే మహానటిలో ఆ పాత్ర చేయడం వల్ల.. ఫ్రెష్‌నెస్ ఉండదనే ఉద్దేశంతో.. అదే కుటుంబానికి చెందిన సుమంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సుమంత్‌లో ఏఎన్నార్ పోలికలు ఎక్కువగా ఉండడం కూడా ఓ కారణమేనని కొందరు చెప్పుకొస్తున్నారు. సుమంత్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. కాగా.. జూలై 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments