మెహరీన్... తన తప్పేం లేదట..
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను హీరోయిన్‌గా పలకరించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్.. వరుస అవకాశాలతో వెండితెర వద్ద సందడి చేస్తుంది. లెటెస్ట్‌గా సుధీర్‌బాబు హీరోగా ఖుషి నిర్మించే సినిమాలో మెహరీన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని ఆమెకు అడ్వాన్స్ చెల్లించారట. ఆ తర్వాత సుధీర్‌బాబు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.
ఇప్పుడు ఆ స్థానంలో కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్నాడు. పులి వాసు దర్శకుడు . ఇప్పుడు నిర్మాత మెహరీన్‌ను వద్దనుకున్నాడేమో కానీ.. అడ్వాన్స్ రిటర్న్ ఇమ్మని అడుగుతున్నాడట.
అయితే ఎప్పటి నుండో డేట్స్ బ్లాక్ చేసి ఉండటం వల్ల తనకు వచ్చిన మరో రెండు సినిమాలను వదులుకున్నానని, తనకు ఆర్ధికంగా నష్టం వాటిల్లిందని మెహరీన్ ఆరోపిస్తుంది. ఖుషి నిర్మాతల సంఘంలో పిర్యాదు చేస్తే, మెహరీన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో పిర్యాదు చేసింది. మరి చివరకు ఈ విషయం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com