ఈ సారీ కూడా వదలడం లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
'అల్లుడు శీను', 'జయజానకి నాయక' చిత్రాలతో మాస్ కథానాయకుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ని తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కొత్త చిత్రంతో బిజీగా ఉన్నాడు. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ మీనా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.
ఇదిలా ఉంటే.. తన గత చిత్రం 'జయజానకి నాయక' లో కీలక పాత్రలు పోషించిన జగపతిబాబు, శరత్ కుమార్ లతో మరోసారి కలిసి నటిస్తున్నాడీ యువ కథానాయకుడు. అలాగే ఆ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే ఈ సినిమాకి కూడా స్వరాలందిస్తుండడం విశేషం. రెండు వరుస చిత్రాలకీ సేమ్ యాక్టర్స్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో శ్రీనివాస్ మరోసారి పనిచేస్తున్నాడన్నమాట. 'జయజానకి నాయక' కి హిట్ టాక్ వచ్చినా.. భారీ బడ్జెట్ కారణంగా నష్టాలు తప్పలేదు. మరి కొత్త చిత్రం విషయంలోనైనా బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే.. శ్రీనివాస్‌కి హిట్ తథ్యం అంటున్నారు విశ్లేషకులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com