జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఆదుకోండి: జనసేన

  • IndiaGlitz, [Saturday,April 24 2021]

జర్నలిస్టులకు తక్షణమే అక్రిడేషన్ కార్డులు, ఆరోగ్య బీమా కార్డులు జారీ చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి విలేకరులు ప్రాణాలు తెగించి రిపోర్టింగ్ చేస్తున్నారని.. వాళ్ల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉండగా బాధ్యతను విస్మరించిందంటూ జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ ప్రకటనను విడుదల చేశారు. హెల్త్ కార్డులు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల కరోనా బారినపడ్డ పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో చేరి ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు, ఆరోగ్య బీమా కార్డుల జారీ కూడా సక్రమంగా చేపట్టడం లేదు. నిబంధనల పేరుతో వేల మంది రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు నిలిపివేశారు. పట్టణ ప్రాంత మండల స్థాయి విలేకరులు ఈ గుర్తిపంు కార్డులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బస్సు పాసులకు కూడా దూరం చేసిన ఘనత జగన్ రెడ్డి గారి ప్రభుత్వానిదే. జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ స్కీమ్స్ కూడా అమలు కావడం లేదు. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి విలేకరులు ప్రాణాలు తెగించి రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ మహమ్మారి విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉండగా బాధ్యతను విస్మరించింది. హెల్త్ కార్డులు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల కరోనా బారినపడ్డ పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో చేరి ఆర్థికంగా చితికి పోతున్నారు.

ఇప్పటికే కొందరు పాత్రికేయ మిత్రులు, వారి కుటుంబ సభ్యులు కరోనా మూలంగా ప్రాణాలు విడిచారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి, వారి సంక్షేమంపై దృష్టి సారించాలి. నిబంధనల పేరుతో పట్టణ, నియోజకవర్గ, మండల స్థాయి విలేకరులకు అక్రిడేషన్, హెల్త్ కార్డులు రాకుండా పాలకులు మోకాలు అడ్డటం మానుకోవాలి. రాష్ట్ర సమాచార శాఖ అనుసరిస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణి చూస్తే జగన్‌రెడ్డిగారికి, ఆయన మంత్రులకు విలేకరుల సంక్షేమంపై ఏమాత్రం బాధ్యత లేదని వెల్లడవుతోంది. రాష్ట్ర, జిల్లా స్థాయి రిపోర్టర్లతోపాటు పట్టణ, నియోజకవర్గ, మండల స్థాయి విలేకరులకు తక్షణమే అక్రిడేషన్, హెల్త్ కార్డులు జారీ చేయాలి. జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ వేయించే బాధ్యతను సమాచార శాఖ తీసుకోవాలి’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

More News

ఆక్సిజన్ కొరతతో 20 మంది మృతి.. ప్రమాదంలో 200 ప్రాణాలు..

దేశమంతటా కోవిడ్ విలయ తాండవం చేస్తోంది. ఎలాగోలా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ఆసుపత్రుల్లో చేరితే ఏదో ఒక కారణంగా ఆసుపత్రుల్లో ప్రాణాలు పోతున్నాయి.

శ్రీ ఏడిద నాగేశ్వరరావు.. అద్భుత కళాఖండాలకు కేరాఫ్..

నేడు(శనివారం) ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు 87వ జయంతి.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

భారత 48వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

వైద్య ఆరోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

కరోనా మహమ్మారి నియంత్రణ, కరోనా పేషెంట్లకు మౌళిక వసతుల కల్పన విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారు.

‘పుష్ప’లో పవర్‌ఫుల్ పాత్రలో అనసూయ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘రంగస్థలం’ ఇప్పుడప్పుడే ఎవరూ మరచిపోలేరు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.