నితిన్‌తో ప్రేమా? ఛాన్సే లేదు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ హీరో అయినా..ఓ హీరోయిన్‌తో చేసే తొలి సినిమా హిట్ అయితేనే వెంటనే రెండో అవకాశం ఇస్తాడు. అయితే నితిన్ మాత్రం అందుకు భిన్నంగా.. సినిమా విడుదలకి ముందే తన తదుపరి సినిమాలోనూ ఓ హీరోయిన్ కి వరుసగా రెండో ఛాన్స్ ఇచ్చాడు. ఇంతలో ఆ మొదటి సినిమా రానే వచ్చింది. కట్ చేస్తే.. సినిమా ఫలితం నెగెటివ్‌గా తేలింది. అయినప్పటికీ ఆమెతోనే సినిమా చేస్తున్నాడు.
దీంతో.. ఇండస్ట్రీ అంతా ఒకటే టాక్. ఆమెతో నితిన్ పీకల్లోతు ప్రేమలో పడ్డాడని. ఇంతకీ ఆ ఆమె ఎవరో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. యస్.. మేఘా ఆకాష్‌నే ఆ హీరోయిన్. లై చిత్రంలో నితిన్, మేఘా జంటగా నటించారు.
ఆ సినిమా విడుదలకి ముందే పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నిర్మించే సినిమాలోనూ వీరిద్దరు మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. నితిన్ తో రెండో సినిమా కోసం.. ఉన్నది ఒకటే జిందగీ చిత్రాన్ని సైతం వదులుకుంది మేఘ. దాంతో వీరి మధ్య ప్రేమాయణం సాగుతోందని టీ టౌన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయాన్ని మేఘ ఖండించింది.
వరుసగా రెండు సినిమాలు చేసినంత మాత్రానా తమ మధ్య ప్రేమ కథ నడుస్తోందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని.. ఓ ఆంగ్ల పత్రికలో చెప్పుకొచ్చింది మేఘ . సో.. మేఘ మాటలతో నితిన్, మేఘ మధ్య ప్రేమ వ్యవహారం లాంటిది లేదని తేలిపోయిందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments