డిసెంబర్లో కాదా? సంక్రాంతి తర్వాతేనా?
- IndiaGlitz, [Friday,October 26 2018]
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి .. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో చాలా బిజీ బిజీగా ఉన్నారు. త్వరలోనే చిరంజీవికి స్క్రిప్ట్ వినిపించాలనుకున్నాడట శివ. చిరు ఓకే చెప్పేస్తే.. సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలెట్టేస్తారు.
ఈ సినిమాను డిసెంబర్లో ప్రారంభిస్తారని ముందు వార్తలు వినిపించాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే లాంఛనంగా సినిమాను ప్రారంభిస్తారట. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సినిమాను నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తే.. తిరు సినిమాటోగ్రఫీ అందించనున్నారు.