రాజకీయాల కోసం కాదు.. నిజం కోసమే! - వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎట్టకేలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తిరుపతిలో ఎట్టకేలకు లాంచనంగా క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ "నేను నాస్తికుడిని. ఏ దేవుడికీ పూజలు చేయలేదు. 'గోవిందా గోవింద' సినిమా కోసం 22 ఏళ్ల క్రితం తిరుపతి వచ్చాను. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను ఇక్కడ స్టార్ట్ చేయడానికి కారణం ఎన్టీఆర్‌గారికి తిరుమల వెకంటేశ్వరస్వామి ఇష్టదైవం. అందుకే ఆయన్ను దర్శించి ఎన్టీఆర్‌గారి జీవిత చరిత్రలోని నిజాలను బహిర్గతం చేసేందుకు శక్తి ప్రసాదించమన్నాను.
తెలుగుజాతి గౌరవాన్ని నిలిపిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన చివరి రోజల్లో పడ్డ బాధ, ఆయనకు జరిగిన అన్యాయం, ఆయనపై చేసిన కుట్ర.. ఇలాంటి అంశాలను లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూపించబోతున్నాను. లక్ష్మీ పార్వతితో వివాహం అనంతరం జరిగిన పరిణామాలపై సినిమా సాగుతుంది. ఆయన ఇంట్లో పనిచేసిన వారి నుండి రాజకీయ నాయకుల వరకు సేకరించిన నిజాలను తెరకెక్కించబోతున్నాను.
ఎన్టీఆర్ ఫోటోలను పెట్టుకుని కొందరు ఓట్లు అడుగుతున్నారు. వారి గురించి నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నాను. ఓ మహా మనిషి గురించి ఎవరైనా సినిమా తీయ్యొచ్చు. అసలు నిజమేంటో ప్రజలే నిర్ణయిస్తారు. ఈ సినిమాకు వై.ఎస్.ఆర్ పార్టీకి సంబంధం లేదు. నిజం కోసం తప్ప.. రాజకీయాల కోసం సినిమా తీయడం లేదు. జనవరి 24, 2019లో విడుదల చేయబోతున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com