రాజకీయాల కోసం కాదు.. నిజం కోస‌మే! - వ‌ర్మ‌

  • IndiaGlitz, [Saturday,October 20 2018]

వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఎట్ట‌కేల‌కు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తిరుప‌తిలో ఎట్ట‌కేల‌కు లాంచ‌నంగా క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ నేను నాస్తికుడిని. ఏ దేవుడికీ పూజ‌లు చేయ‌లేదు. 'గోవిందా గోవింద‌' సినిమా కోసం 22 ఏళ్ల క్రితం తిరుప‌తి వ‌చ్చాను. మ‌ళ్లీ ఇప్పుడు ఈ సినిమాను ఇక్క‌డ స్టార్ట్ చేయ‌డానికి కార‌ణం ఎన్టీఆర్‌గారికి తిరుమ‌ల వెకంటేశ్వ‌ర‌స్వామి ఇష్ట‌దైవం. అందుకే ఆయ‌న్ను ద‌ర్శించి ఎన్టీఆర్‌గారి జీవిత చ‌రిత్ర‌లోని నిజాల‌ను బ‌హిర్గ‌తం చేసేందుకు శ‌క్తి ప్ర‌సాదించ‌మ‌న్నాను.

తెలుగుజాతి గౌర‌వాన్ని నిలిపిన మ‌హ‌నీయుడు ఎన్టీఆర్‌. ఆయ‌న చివ‌రి రోజ‌ల్లో ప‌డ్డ బాధ‌, ఆయ‌న‌కు జ‌రిగిన అన్యాయం, ఆయ‌న‌పై చేసిన కుట్ర‌.. ఇలాంటి అంశాల‌ను ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూపించ‌బోతున్నాను. ల‌క్ష్మీ పార్వ‌తితో వివాహం అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల‌పై సినిమా సాగుతుంది. ఆయ‌న ఇంట్లో ప‌నిచేసిన వారి నుండి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు సేక‌రించిన నిజాల‌ను తెర‌కెక్కించ‌బోతున్నాను.

ఎన్టీఆర్ ఫోటోల‌ను పెట్టుకుని కొంద‌రు ఓట్లు అడుగుతున్నారు. వారి గురించి నిజాల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నాను. ఓ మ‌హా మ‌నిషి గురించి ఎవ‌రైనా సినిమా తీయ్యొచ్చు. అస‌లు నిజ‌మేంటో ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు. ఈ సినిమాకు వై.ఎస్‌.ఆర్ పార్టీకి సంబంధం లేదు. నిజం కోసం త‌ప్ప‌.. రాజ‌కీయాల కోసం సినిమా తీయ‌డం లేదు. జ‌న‌వ‌రి 24, 2019లో విడుద‌ల చేయ‌బోతున్నాం అన్నారు.

More News

'పేట్ట' షూటింగ్ పూర్తి...

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది.

విజ‌య్ సేతుప‌తి పై క‌త్తి మ‌హేశ్ కామెంట్స్‌

టాలీవుడ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టార్గెట్ చేసి త‌న‌కు ప్ర‌శ్నించే హ‌క్కు ఉంద‌ని అంటూ వచ్చిన క‌త్తి మ‌హేశ్‌ను కొన్ని రోజులు హైద‌రాబాద్ నుండి బ‌హిష్క‌రించారు.

మ‌హేశ్ త‌ప్పు.. ట్రోలింగ్‌తో దిద్దుబాటు?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేశ్ ఇప్పుడు యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్స్‌ను ఎంచుకుంటున్నారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భ‌గా మ‌హేశ్ నేడు అంద‌రికీ ట్విట్ట‌ర్ ద్వారా  తెలియ‌జేశారు.

ప్రియాంక పెళ్లి వాయిదా?

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో మెప్పించిన ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకోనుంది.

బాలీవుడ్ రీమేక్ యోచ‌న‌...

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంక‌ర త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.