ఈసారి బాల‌య్య కాదు.. ఆయ‌న విల‌న్ డ‌బుల్ రోల్‌

  • IndiaGlitz, [Monday,May 13 2019]

ఈ మ‌ధ్య బాల‌కృష్ణ చేస్తోన్న సినిమాల్లో సింహా, లెజెండ్ సినిమాలు చాలా పెద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లోనూ ఆయ‌న డ్యూయెల్ రోల్ చేశాడు. ఇప్పుడు ఆయ‌న 105 సినిమాలో కూడా డబుల్ రోల్ చేస్తాడ‌ని కూడా వార్త‌లు వచ్చాయి.

అయితే బాల‌కృష్ణ డ‌బుల్ రోల్ చేయడం లేద‌ట‌. సినిమాలో ప్ర‌ధాన విల‌న్‌గా న‌టిస్తోన్న జ‌గ‌ప‌తిబాబు డ్యూయెల్ రోల్‌లో క‌న‌ప‌డ‌తాడ‌రని స‌మాచారం. 'జైసింహా' త‌ర్వాత బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ఈ నెల‌లో చిత్రీక‌ర‌ణ‌, వ‌చ్చే నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. బాల‌య్య స‌ర‌స‌న ఇద్ద‌రూ హీరోయిన్స్ న‌టిస్తుండ‌గా.. ఈ చిత్రంలో బాల‌కృష్ణ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారని టాక్‌.