అనిరుధ్ కాదు...దేవిశ్రీప్రసాదే..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్.... సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా అనిరుధ్ ని అనుకున్నారట. అయితే...అనిరుథ్ పవన్ - త్రివిక్రమ్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ మూవీతో పాటు మరో మూడు సినిమాలుతో అనిరుధ్ బిజీగా ఉన్నాడు. అందుచేత అనిరుథ్ అయితే మ్యూజిక్ ఇవ్వడం లేట్ అవుతంది అనే ఉద్దేశ్యంతో దేవిశ్రీప్రసాద్ నే ఫిక్స్ చేసినట్టు సమాచారం. పైగా ఎన్టీఆర్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో.., జనతా గ్యారేజ్ చిత్రాలు ఎంతటి విజయాల్ని సాధించాయి తెలిసిందే. సెంటిమెంట్ ప్రకారం కూడా కలిసొస్తుందనే ఉద్దేశ్యంతో దేవినే ఫిక్స్ చేసారట. ఎన్టీఆర్ తో దేవిశ్రీ ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టేస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments