నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పరిస్థితి విషమం.. రంగంలోకి అమెరికా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాటేస్తున్న వేళ ఈ వార్త బయటికి రావడంతో పెను సంచలనమైంది. కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కిమ్‌కు గుండె సంబంధ ఆపరేషన్ జరిగింది. సర్జరీ తర్వాత కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అతిగా స్మోకింగ్ చేయడం.. లావు ఎక్కువగా ఉండటంతో ఒబెసిటితో కిమ్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని సౌత్ కొరియాకు సంబంధించిన ఓ ప్రముఖ వెబ్ సైట్ తెలిపింది. అయితే ఇటీవలే.. (ఈనెల 15న) తన తాత జయంతి వేడుకలకు జరగ్గా.. కిమ్ హాజరుకాలేదు. అసలు ఆయన ఎందుకు హాజరు కాలేదు..? కిమ్‌కు ఏమైంది అని ఆరా తీయగా ఈ షాకింగ్ విషయం వెలుగు చూసింది. అయితే ఇంతవరకూ అధికారికంగా అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు. అంతేకాదు కిమ్ పరిస్థితిపై మాట్లాడాలని అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖను కోరగా.. ఎలాంటి రియాక్షన్ లేదు.
రంగంలోకి దిగిన అమెరికా!
సౌత్ కొరియా అంటే అమెరికాకు పడదన్న విషయం తెలిసిందే. ఇవి రెండు బద్ధ శత్రువులు. ట్రంపే డేంజర్ అనుకుంటే ఆయన్ను మించిన ప్రమాదకారి కిమ్. అందుకే కొరియాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఎప్పట్నుంచో అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా కిమ్ పరిస్థితిపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తుండటంతో అమెరికా నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. అక్కడ అసలేం జరుగుతోంది..? ఇందులో నిజానిజాలెంత..? అనే విషయాలను అమెరికా నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే.. కొరియా నుంచి సమాచారం రాబట్టడం.. తెలుసుకోవడం అంత సులువు కాదని, అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తుందని.. నిఘా వర్గాలు చెబుతున్నాయి. కిమ్ ఆరోగ్యంపై.. అమెరికా నిఘా వర్గాల వ్యవహారంపై పూర్తి సమాచారం వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments