సూర్య సహా ఏడుగురు నటులపై నాన్ బెయిలబుల్ వారెంట్...
- IndiaGlitz, [Tuesday,May 23 2017]
తమిళ స్టార్ హీర సూర్య సహా శరత్‌కుమార్, చేరన్, విజయ్‌కుమార్, సత్యరాజ్, అరుణ్ విజయ్, వివేక్, శ్రీప్రియలపై ఊటీ, నీలగిరి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.
2009లో ఓ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై ఈ నటీనటులందరూ తీవ్రస్థాయిలో తమ వ్యతిరేకతను తెలియజేశారు. దాంతో సదరు సీనియర్ జర్నలిస్ట్ ఈ నటీనటులపై పరువు నష్టం కేసు వేశారు. కోర్టు పలు మార్లు ఈ నటీనటులను కేసు పురోగతి విషయంలో ఎటువంటి సహాకారం అందించకుండా కోర్టుకు హాజరు కాకపోవడం కోర్టు వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసును జూన్ 17కు వాయిదా వేసింది.