డైరెక్టర్ శంకర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
- IndiaGlitz, [Monday,February 01 2021]
స్టార్ డైరెక్టర్ శంకర్‌కి చెన్నై ఎగ్మోర్ మేజిస్ట్రేట్ మెట్రోపాలిటిన్ కోర్టుషాకిచ్చింది. నాబ్ బెయిలబుల్ వారెంట్‌ను ఇష్యూ చేసింది. అందుకు కారణం తెలుసుకోవాలంటే పదకొండేళ్లు ముందుకు వెళ్లాలి. 2010లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోబో’. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించాడు. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ కథను తనదంటూ కొన్నేళ్ల క్రితం ప్రముఖ రచయిత అరుర్ తమిళ నందన్ కోర్టులో కేసు వేశాడు. కేసును పరిశీలిస్తున్న ఎగ్మోర్ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణకు హాజరు కావాలంటూ కోరిన శంకర్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
1996లో అరుర్ తమిళ్‌నందన్ ఓ తమిళ మ్యాగజైన్లో జిగుబా అనే కథను రాశాడు. ఆ కథ నవల రూపంలోనూ అచ్చయ్యింది. దాన్ని ఆధారంగానే చేసుకునే శంకర్ రోబో సినిమాను చేశాడంటూ రైటర్ తమిళ్ నందన్ కేసు వేశాడు. నాన్ బెయిలబుల్ జారీ చేసిన కోర్టు ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. రోబో సీక్వెల్లో 2.0 చిత్రం 2018లో విడుదలైన సంగతి తెలిసిందే. మరి తనపై కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుట్ వారెంట్‌పై శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి. శంకర్ ప్రస్తుతం ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.