చిక్కుల్లో సోనాక్షీ సిన్హా: చీటింగ్ కేసు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనాక్షీ సిన్హా తొలుత వరుస విజయాలతో మంచి ఊపు మీద కనిపించింది. అయితే ఆ తర్వాత ఫ్లాప్‌లు పలకరించడంతో ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్లుగా విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తుంది. వెయిట్ లాస్ అయినా ఆమెను కరుణించేవారు లేరు. ఇప్పుడు మరో ఆప్షన్ లేక అందాలన్నీ ఆరబోస్తూ హాట్ ఫోటో షూట్లు చేస్తోంది సోనాక్షీ సిన్హా. మిగిలిన బాలీవుడ్ బ్యూటీల మాదిరే సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది సోనాక్షీ. నిత్యం తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వుంటుంది.
అలాంటి సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై ఛీటింగ్ కేసు నమోదవ్వగా.. ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది కోర్టు. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ నగరంలోని కట్ఘర్ అనే ప్రాంతానికి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఢిల్లీలో ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఓ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా సోనాక్షి సిన్హాను ఆహ్వానించారు. ఇందుకోసం ఆమెకి రూ.37 లక్షలను అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారు. తీరా చూస్తే.. ఆమె ఈవెంట్‌కి హాజరు కాలేదు. దీంతో తాను ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాలని ప్రమోద్ శర్మ.. సోనాక్షి సిన్హా మేనేజర్‌ను కోరారు. దానికి ఆయన నిరాకరిస్తూ వచ్చారు. చివరికి ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో విసిగిపోయిన ప్రమోద్.. సోనాక్షి సిన్హాపై కోర్టుకెక్కారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని సోనాక్షి సిన్హాకి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మొరాదాబాద్ కోర్టు సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. మరి న్యాయస్థానం యాక్షన్‌పై సోనాక్షీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com