ఎట్టకేలకు ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

  • IndiaGlitz, [Saturday,December 12 2020]

మూడు నెలల సుదీర్ఘ విరామానంతరం ఎట్టేకేలకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో వెంటనే అప్రమత్తమైన సీఎం కేసీఆర్.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా.. స్లాట్ బుకింగ్స్ మాత్రం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్లాట్ల బుకింగ్‌కు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌లో పొందుపర్చిన ‘నాన్‌-అగ్రికల్చర్‌’ ఆప్షన్‌ ఓపెన్‌ కాలేదు.

ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఒక్కో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ల బుకింగ్‌ జరగనున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు అందజేస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ లేనివారి విషయంలో కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేయవచ్చన్నారు. పెండింగ్‌ మ్యూటేషన్లు ధరణిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 100 మంది అధికారులు, నిపుణులతో బీఆర్కే భవన్‌లో వార్‌ రూం ఏర్పాటు చేసినట్లు సోమేశ్ కుమార్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే ఈ-పాస్‌బుక్‌ ఇస్తామన్నారు.

కాగా.. 4143 మంది డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయగా.. గత రాత్రి 7 గంటల వరకు రాష్ట్రమంతా కలిపి కేవలం 37 స్లాట్లు బుక్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం నుంచి మీ సేవ నుంచి కూడా స్లాట్లు బుక్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. రూ.200 చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. బల్క్‌ రిజిస్ట్రేషన్ల కోసం కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే 451 మంది బిల్డర్లు 93,874 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేశారు. కాగా.. లే-అవుట్‌ అప్రూవల్స్‌ లేని భూముల్లో విక్రయించిన ఓపెన్‌ ప్లాట్ల కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను అమల్లోకి తెచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

More News

స్టార్ డైరెక్ట‌ర్స్‌కి షాకిచ్చిన విజ‌య్‌..!

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ ఇప్పుడిప్పుడే త‌న సినిమాల‌కు తెలుగులో మార్కెట్‌ను క్రియేట్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు.

రాజకీయంగా చర్చనీయాంశంగా.. అమిత్ షాతో కేసీఆర్ భేటీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రోసారి వ్యాఖ్యాత‌గా ఎన్టీఆర్

సీనియ‌ర్ అగ్ర హీరోల్లో చిరంజీవి, నాగార్జున వెండితెర‌పైనే కాదు.. బుల్లితెర‌పై కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

హైదరాబాద్‌లో ప్రారంభమైన అమితాబ్‌ బచ్చన్‌–అజయ్‌ దేవగణ్‌ కాంబినేషన్‌లోని ‘మే డే’

బిగ్‌ బి అమితాబ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమా ‘మే డే’. దీనికి ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ దర్శకుడు,

అజయ్.. శ్రద్ధా దాస్.. ఆమని ప్రధాన తారలుగా సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం' 

అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. ఈ చిత్రానికి 'నాటకం' చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మాత.