Telangana Nominations:తెలంగాణలో మొదలైన నామినేషన్ల పర్వం.. ఈసారి కొత్త నిబంధనలు

  • IndiaGlitz, [Friday,November 03 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల పర్వంకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసులను అధికారులు జారీచేశారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 10 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలు, ఆపీసర్ గదిలోకి అభ్యర్థితో పాటు ఐదుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.

నేరచరిత్ర స్పష్టంగా పేర్కొనాలి..

నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను తప్పనిసరిగా దాఖలు చేయాలి. అయితే ఈసారి అభ్యర్థులు తమ నేరాలను అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొనాలంటూ ఈసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంతేకాదు వాటిని మూడుసార్లు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని కూడా ఆదేశించింది. అభ్యర్థి జైలులో కనుక ఉంటే అధికారుల ఎదుట ప్రమాణం చేసి వారి ధ్రువీకరణతో పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు తెలిపేందుకు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అధికారికి సమర్పించాలి. అలాగే సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని ఈసీ కల్పించింది. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడవిట్ పత్రాలను 24 గంటల్లోనే CEO వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు .

నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్..

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నవంబర్‌ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 35,356 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్‌ టీమ్‌లు, అకౌంటింగ్‌ బృందాలు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్, స్టాటిక్‌ సర్వైలియన్స్‌ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఇక మొత్తం 119 స్థానాలకు గాను బీఆర్ఎస్ ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ 100, బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.

More News

ప్రాంతీయ భాషల్లో సోనీ లివ్ 'మాస్టర్ చెఫ్ ఇండియా'... త్వరలో తమిళ్, తెలుగులో స్ట్రీమింగ్

ఓటీటీలు రంగ ప్రవేశం చేసిన తర్వాత రియాలిటీ షోలకు ఆదరణ పెరిగింది. గతంలోనే ఈ కార్యక్రమాలు వున్నప్పటికీ వాటికి సెలెక్డ్‌డ్ ఆడియన్స్ వుండేవారు.

33 ఏళ్ల తర్వాత అమితాబ్‌తో .. నా గుండె ఆనందంతో కొట్టుకుంటోంది, రజనీ ట్వీట్ వైరల్

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్.. భారతదేశం గర్వించదగ్గ నటులు. 70 ప్లస్‌లోనూ ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు వీరిద్దరూ.

'నిజం గెలవాలి' యాత్ర ప్రారంభించిన భువనేశ్వరి.. బాధిత కుటుంబాలకు పరామర్శ..

'నిజం గెలవాలి' యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభమైంది. నారావారిపల్లెలో ఆమె తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు

మెగా 156లో చిరంజీవికి విలన్‌గా దగ్గుబాటి రానా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగా 156వ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. విజయ దశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో

Ram Charan:రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం .. ఆస్కార్‌ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు , పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్.