నోయల్-ఎస్తేర్ వివాహం
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడిగా ‘మగధీర’, ‘ఈగ’, ‘కుమారి 21 ఎఫ్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ప్రేమమ్’, ‘రంగస్థలం’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సినిమాల్లో నటించి నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు నోయల్. ఇక ‘1000 అబద్ధాలు’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమై తర్వాత ‘భీమవరం బుల్లోడు’, ‘జయ జానకి నాయక’ చిత్రాల్లో ఆమె నటించింన ఎస్తేర్ కొంత కాలంగా డేటింగ్ ఉన్నారు. రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్న వీరివురూ పెళ్లి చేసుకున్నారు.
మంగళూరులో క్రైస్తవ మత పద్ధతిలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెళ్లిలో దిగిన ఫొటోను నోయెల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. తాము ఇప్పుడు ఇద్దరు కాదని, ఒక్కటే అని అన్నారు. తన హృదయానికి ఆమే రాణి అని నోయెల్ ట్వీట్ చేశారు. అందరి ఆశీస్సులు కావాలని కోరారు. వీరి వివాహానికి ఎస్.ఎస్.రాజమౌళి, రమ రమా రాజమౌళి కూడా హాజరయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments