నోయెల్ రీఎంట్రీ.. షాక్ ఇస్తున్న వీడియో..

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

‘బిగ్‌బాస్’ ఏదైనా జరగొచ్చు అని ఎప్పుడో చెప్పేశారు. ఇక అంతా అయిపోయింది. సింగర్ నోయెల్‌కు సెండాఫ్ కూడా ఇచ్చేశారు. ఇక హోస్ట్ నాగార్జున కూడా తిరిగిరాడు అని చెప్పారు. వెళ్లే ముందు తీర్చుకోవాల్సిన బాకీలన్నీ తీర్చుకుని వెళ్లిపోయాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ నోయెల్ విడుదల చేసిన ఓ వీడియో మాత్రం షాకిస్తోంది. నోయెల్ చెప్పిన మాటలు వింటే బిగ్‌బాస్‌లోకి అతని రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా జరగొచ్చంటూ నోయెల్ చెప్పిన మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

‘‘ఎలా ఉన్నారు అంతా? ఆల్ మై గ్యాంగ్‌స్టర్స్. లవ్ యూ అలాట్. నాతో ఉన్నందుకు.. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ సోమచ్. నా హెల్త్ గురించి ఎన్నో మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. మీ ప్రేమాభిమానాలు చూసి నేను చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. ఇంకా ఏదైనా జరగొచ్చు. ద గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. అయిపోయిందనుకున్నోడు మళ్లీ వస్తే ఆ కిక్కే వేరుంటది కదా.. మళ్లీ లైవ్‌కి వస్తా. డీటైల్స్ అన్నీ అప్‌డేట్ చేస్తా. చాలా ఉంది మాట్లాడుకోవడానికి.. చాలా రోజుల తర్వాత వస్తున్నా’’ అని వీడియోలో నోయెల్ చెప్పాడు.

More News

ఇటు చిరు.. అటు రజినీ.. దక్షిణాదిలో సినీ ప్రముఖులే టార్గెట్..

సూపర్‌స్టార్ రజినీకాంత్ కాషాయ తీర్థం తీసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి.

ప‌వ‌న్ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా ఖ‌రారైందా..?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

`రాధేశ్యామ్` నుండి తిరిగొచ్చేసిన పూజాహెగ్డే..

`రాధేశ్యామ్` నుండి పూజా హెగ్డే తిరిగొచ్చేసిందా! అంటే అవును నిజ‌మే అనాలి.

'ఆర్ఆర్ఆర్‌`లో జ‌లియ‌న్ వాలాభాగ్‌

జలియ‌న్ వాలాభాగ్ ఘ‌ట‌న అన‌గానే ఎవ‌రికైనా స్వాతంత్ర్యానికి ముందు జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ ప్ర‌జ‌ల‌పై అకృత్యంగా చేసిన కాల్పుల ఘ‌ట‌నే గుర్తుకు వ‌స్తుంది.

నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌..!

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కొత్త చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ లిస్టులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై