హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన నోయెల్..

  • IndiaGlitz, [Friday,October 30 2020]

ఓపెనింగే.. నోయెల్ అర్థరాత్రి అందరూ పడుకున్నాక తన ఆరోగ్య సమస్యతో బాధ పడటం చాలా కలచి వేసింది. నైట్ అంతా నిద్ర పోకుండా తన బాధను మరిచిపోయేందుకు పాట పాడుతూ గడిపాడు. మెగాస్టార్ సాంగ్‌తో డే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుత రేషన్ మేనేజర్ అయిన అరియానా.. గత రేషన్ మేనేజర్‌ అయిన మెహబూబ్‌కి అతను వాడకుండా పోవడంతో కూరగాయలు పాడవుతున్నాయంటూ క్లాస్ పీకింది. మోనాల్ ఒంటెలా నడుస్తోందని అభి కామెంట్. నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చుంటావని అభికి నోయెల్ చెప్పాడు. ఇక కెప్టెన్సీ టాస్క్. ఒక టేబుల్‌పై తాళం చెవి పెట్టి దాన్ని మగ సభ్యుల్లో ఒకరు తీసుకోవాలి. ఆ కీని తమ వద్ద ఎందుకు ఉండాలో చెప్పుకుని ఆ కీని సదరు సభ్యుడి నుంచి తీసుకోవాలి. ఫస్ట్ రౌండ్‌లో కీని అఖిల్ దక్కించుకున్నాడు. లేడీ కంటెస్టెంట్‌లంతా తమకు ఎందుకు కీ కావాలో చెప్పిన తరువాత అఖిల్ అంతా భావించినట్టుగానే మోనాల్‌కు ఇచ్చాడు. కీ దక్కించుకున్న వ్యక్తి చెట్టుపై ఉన్న యాపిల్‌ను కోసి వాటిని కట్ చేయాలి. ఆ యాపిల్‌పై కంటెస్టెంట్ల ఫోటోలు ఉంటాయి. చివరిగా మిగిలిన యాపిల్ ఎవరిదైతే వాళ్లు టాస్క్ విన్ అయినట్టు.

మోనాల్ హారిక యాపిల్‌ను కట్ చేసింది. ఈ సందర్భంగా మోనాల్ ఇచ్చిన రీజన్ హారికకు నచ్చలేదు. ముగ్గురి సపోర్ట్‌తో హారిక హౌస్‌లో కొనసాగుతోందని మోనాల్ చెప్పడాన్ని హారిక తీసుకోలేకపోయింది. సిల్లీ రీజన్స్‌తో ఇలా చెయ్యొద్దని కాస్త సీరియస్ అయింది. రెండోసారి కీని మెహబూబ్ దక్కించుకున్నాడు. లాస్యకు కీ ఇవ్వమని మెహబూబ్‌కి అమ్మ రాజశేఖర్ సైగ చేశారు అయినప్పటికీ కీని అరియానాకు ఇచ్చాడు. లాస్య యాపిల్‌ను అరియానా కట్ చేసింది. ఈ సందర్భంగా లాస్య కామెంట్.. నేను పొట్టిదాన్నైనా గట్టిదాన్ని నా యాపిల్ కట్ చేయడం అంత సులభం కాదని.. కానీ అరియానా హౌస్‌లో ఉన్నవాళ్లంతా గట్టివాళ్లేనని కౌంటర్ ఇచ్చింది. నెక్ట్స్ కీని అమ్మ రాజశేఖర్ దక్కించుకున్నారు. ఆయన కీని అరియానాకు ఇచ్చారు. దీంతో అరియానా ఇంటి కెప్టెన్‌గా ఎంపికైంది. తరువాత మోనాల్‌తో హారిక డిస్కషన్. నువ్వు చెప్పిన రీజన్ కారణంగా నేను ఇంతకాలం ఈ హౌస్‌లో ఆ ముగ్గురి సపోర్ట్‌తోనే కొనసాగుతున్నట్టు మీనింగ్ వచ్చిందని చెప్పారు. ఇక కెప్టెన్ అరియానా.. మోనాల్‌ను రేషన్ మేనేజర్ చేసింది. దీంతో అమ్మ రాజశేఖర్ చాలా హర్ట్ అయ్యారు. తనకు రేషన్ మేనేజర్ ఇవ్వకుండా మోనాల్‌కు ఇవ్వడమేంటని ఆయన ఫైర్ అయ్యారు. నేను నామినేషన్‌లో ఉన్నా కాబట్టి నాకు రేషన్ మేనేజర్ ఇచ్చి ఉంటే తనకు హెల్ప్ అయ్యేదని అమ్మ రాజశేఖర్ వాదన. విశ్వాసం లేదంటూ అరియానాపై మండిపడ్డారు. రేషన్ మేనేజర్‌గా ఉంటే సేఫ్ అవుతామని ఎక్కడా లేదని అరియానా వాదన.

మోనాల్‌కి కీ ఇచ్చి ఉంటే.. అఖిల్‌ని రేషన్ మేనేజర్‌ని చేస్తుందని ఫీలై.. అరియానాకు ఇచ్చినట్టున్నారు. అరియానా తనకు రేషన్ మేనేజర్ ఇవ్వకపోవడంతో అమ్మ రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యారు. కోల్గేట్ వేదశక్తి టాస్క్. నోయెల్ ఆరోగ్యం సరిగా లేనందున డాక్టర్‌ని కలిశాడు. మరోవైపు హారిక ఏడుస్తుంటే అభి ఓదార్చాడు. నోయెల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. మరింత మెరుగైన వైద్యం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికైతే నోయెల్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని బిగ్‌బాస్ చెప్పారు. నోయెల్ వెళ్లిపోయినందుకు హారిక బాగా హర్ట్ అయింది. మొత్తమ్మీద కెప్టెన్సీ టాస్క్ అయితే పెద్దగా మజా ఇవ్వలేకపోయింది. అరియానా కెప్టెన్ అవడం.. అమ్మ రాజశేఖర్ రచ్చ.. నోయెల్ బయటకు వెళ్లిపోవడం వంటి అంశాలతో ఇవాళ్టి షో నడిచింది.

More News

బుల్లితెరపై కూడా ఆకట్టుకోలేక పోయిన ‘సాహో’..

యంగ్ రెబల్ స్టార్‘బాహుబలి’తరువాత భారీ అంచనాలతో పాటు భారీ బడ్జెట్‌తో వచ్చిన చిత్రం ‘సాహో’.'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో

పసుపు వేడుకలో మెరిసిపోయిన కాజల్

స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకలు అంగరంగ ప్రారంభమయ్యాయి.

అతనికి ఎస్ చెప్పానంటూ ఫోటో రివీల్ చేసిన పునర్నవి..

ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం తనకు కాబోయే వ్యక్తికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తోంది.

సుమంత్‌ 'కపటధారి' టీజర్‌ విడుదల

" ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది" అని అంటున్నారు హీరో సుమంత్‌.

రైతుల భూముల సంపూర్ణ రక్షణకే ధరణి పోర్టల్: కేసీఆర్

మూడుచింతలపల్లిలో ధరణి వెబ్ పోర్టల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారు.