అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను వాయించేసిన నోయెల్..
Send us your feedback to audioarticles@vaarta.com
కులు మనాలి నుంచి హోస్ట్ నాగార్జున హెలికాఫ్టర్‌లో బయల్దేరుతున్న సీన్‌ను చూపించారు. మెగా పవర్ స్టార్ ‘రంగస్థలం’ సాంగ్‌తో షోను స్టార్ చేశారు. క్రితం రోజు ఏం జరిగిందో నాగ్ చూశారు. ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ టాస్క్ నడిచింది. బాయ్స్ టీం, గర్ల్స్ టీంలుగా విడిపోయి.. రెండు డిషెస్ చేయాలి. దీనిలో బాయ్స్ టీం గెలిచింది. కులుమనాలి నుంచి గిఫ్ట్స్ తీసుకువచ్చారు. అవి ఇచ్చిన తరువాత.. అఖిల్, సొహైల్‌ను నాగ్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. వాళ్లిద్దరి మధ్య మిస్ కమ్యూనికేషన్ గురించి ప్రస్తావించి సొహైల్ మాట్లాడిన వీడియోలు ప్లే చేశారు. ఆ తరువాత మోనాల్ వచ్చి అఖిల్‌కి సొహైల్ గురించి చెప్పిన వీడియోను కూడా ప్లే చేశారు. ఆ తరువాత మోనాల్, అఖిల్, సొహైల్ కూర్చొని మాట్లాడుకున్న వీడియోను కూడా ప్లే చేసి అఖిల్, సొహైల్‌లకు చూపించారు. మొత్తానికి వాళ్లిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణమైన వీడియోలన్నీ నాగ్ చూపించారు. థర్డ్ పర్సన్ వచ్చి చెప్పిన మాటలు విన్నందునే ఇలాంటి అపార్ధాలు తలెత్తాయని ఇద్దరూ ఒప్పుకొన్నారు. బయటకు వచ్చి ఒకరినొకరు హగ్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. తరువాత మోనాల్‌ను కన్ఫెషన్ రూమ్‌కి నాగ్ పిలిచారు. నాగ్.. నోయెల్‌తో మోనాల్ మాట్లాడిన విషయాలను అభి, లాస్యలకు చెబుతున్న వీడియోతో పాటు మోనాల్ ఒంటెలా నడుస్తుందంటూ అభి కామెంట్ చేసిన వీడియోను సైతం నాగ్ ప్లే చేసి చూపించారు.
అరియానాను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. నీకోసం ఎవరూ త్యాగం చేయడం లేదని ఇది నీకు అర్థం కావడానికి ఒక వీడియోను చూపిస్తానంటూ అమ్మ రాజశేఖర్ మాట్లాడిన వీడియోను.. ప్లే చేసి చూపించారు. నీ గేమ్ నువ్వు ఆడు.. వేరే వాళ్ల గురించి పట్టించుకోవద్దని అరియానాకు నాగ్ సూచించారు. 56వ రోజులో ఈ హౌస్‌లో విలన్ ఎవరనుకుంటున్నారో చెప్పి క్రౌన్ పెట్టాలి. అఖిల్.. అభికి క్రౌన్ చెప్పాడు. సొహైల్.. అరియానాకు క్రౌన్ పెట్టాడు. అమ్మ రాజశేఖర్.. అభికి క్రౌన్ పెట్టారు. హారిక.. మెహబూబ్‌కి.. మెహబూబ్.. హారికకి.. క్రౌన్ పెట్టాడు. ఇక అవినాష్‌ని చిన్న పిల్లాడిలా చేయమని నాగ్ చెప్పారు. అరియానా.. అమ్మ అని.. అమ్మ నుంచి చాక్లెట్ తీసుకోవాలని సూచించారు. తరువాత అవినాష్.. లాస్యకి.. లాస్య.. అవినాష్‌కి క్రౌన్ పెట్టారు. అరియానా.. అఖిల్‌కి.. అభి.. అమ్మ రాజశేఖర్‌కి.. మోనాల్.. లాస్యకి క్రౌన్ పెట్టింది. తరువాత నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో నాగ్.. అఖిల్‌ను సేఫ్ చేశారు.
నోయెల్‌ను బయటకు పంపించడానికి కారణాలను నాగ్ వివరించారు. ఆ తరువాత నోయెల్‌కు ప్రాపర్ సెండాఫ్ ఇవ్వాలని తనను పిలిచానని నాగ్ చెప్పారు. నోయెల్.. తనకు కీళ్లకు సంబంధించిన ప్రాబ్లమ్ అని చెప్పాడు. తరువాత నోయెల్ జర్నీ వీడియోను నాగ్ చూపించారు. నోయెల్‌ను చూసి కంటెస్టెంట్లంతా ఆశ్చర్యపోయారు. అయితే నోయెల్ ఇంక రారని నాగ్ చెప్పారు. తరువాత అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను నోయెల్ ఒంటి కాలిపై నిలబెట్టాడు. అభి, హారిక, లాస్య టాప్ 5లోకి రావాలని నోయెల్ కోరాడు. అఖిల్ బాగా ఆడుతున్నావని చెప్పాడు. వెళ్లే ముందు అరియానాను కెప్టెన్‌గా చూడటం ఆనందంగా ఉందని నోయెల్ చెప్పాడు. సొహైల్‌కి చిన్నపిల్లాడివని చెప్పాడు. ఈ సందర్భంగా నోయెల్ ర్యాప్ మంచి స్ఫూర్తినిచ్చేదిగా ఉంది.
ఇక కాళ్లు నొప్పొచ్చాయా? అని అమ్మ రాజశేఖర్, అవినాష్‌ని అడిగాడు. అమ్మ.. చాలా నొప్పిగా ఉన్నాయని చెబితే దానికంటే వెయ్యి రెట్ల నొప్పిని నేను రోజూ అనుభవిస్తున్నానని చెప్పాడు. మీరిద్దరూ జోక్ చేస్తారేంటి మాస్టర్ అని ప్రశ్నించాడు. మీ బిహేవియర్‌తో షో చూసేవాళ్లకు ఏం చెప్తున్నారంటూ నోయెల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. అమ్మ ఏదో మాట్లాడబోతే.. ఒక్క నిమిషం.. నేను మాట్లాడుతున్నా మాస్టర్ అని ఆపేశాడు. అవినాష్ నేను ఎలా నడుస్తానో చేసి చూపిస్తున్నాడు. ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? అంటూ ఫైర్ అయ్యాడు. కోట్ల మంది జనాలు చూస్తుంటే.. చిల్లర కామెడీలేంటి మాస్టర్.. జోకరా మీరు? అని ప్రశ్నించాడు. అవినాష్ కాలికి దెబ్బ తగిలినప్పుడు కట్టు కట్టానని.. మాస్టర్ కాలికి దెబ్బ తగిలితే కాలు నొక్కానని నేను అలా ఎగతాళి చేయలేదని నోయెల్ చెప్పాడు. దీంతో అవినాష్ కూడా ఫైర్ అయ్యాడు. చిల్లర కామెడీ అయితే ఇక్కడికి వస్తానా.. అంటూ మండిపడ్డాడు. ఇన్ని రోజులు నువ్వు యాక్ట్ చేశావని అవినాష్ చెప్పాడు. కొన్ని కోట్ల మందిని నవ్విస్తున్నా.. నాది చిల్లర కామెడీ అంటావా? అంటూ అవినాష్ చాలా సీరియస్ అయ్యాడు. నాలుగు జోకులు చెబితే ముందుకు వెళ్లరని నోయెల్ చెప్పాడు. మధ్యలో అభి కూడా చాలా ఫైర్ అయ్యాడు. తనను మంచిగా సెండాఫ్ ఇవ్వాలని అభి చెప్పాడు. మధ్యలో నాగ్ కల్పించుకుని నోయెల్..తన బాధను తాను చెప్పుకున్నాడని.. అది కరెక్ట్ అయితే మార్చుకోవాలని.. కాకుంటే ఊరుకోవాలని నాగ్ సూచించారు. ఇదంతా మూడు రోజుల క్రితం జరిగిందని నోయెల్ చెప్పాడు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు.. పిచ్చ లైట్ అని నోయెల్ చెప్పాడు. కామెడీ గురించి కాదని.. నాగ్, నోయెల్ చెబుతున్నా అవినాష్ వినిపించుకోలేదు. అమ్మ రాజశేఖర్ కూడా నన్ను బండోడా అన్నావని.. గుండు అని ఎన్నో సార్లు అన్నావంటూ ఫైర్ అయ్యారు. తరువాత లాస్యను నోయెల్ సేఫ్ చేశాడు. నోయెల్ ర్యాప్ పాడుతుంటే అమ్మ, అవినాష్ తప్ప అంతా లేచి నిలబడి ఎంజాయ్ చేశారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులూ బాబాలా ఉన్నా వెళ్లేటప్పుడు తను చెప్పాలనుకున్నదంతా నిక్కచ్చిగా చెప్పి వెళ్లాడని నాగ్ పేర్కొన్నారు. మొత్తమ్మీద ఇప్పటి వరకూ రేలంగి మామయ్యలా ఉన్న నోయెల్.. వెళ్లేటప్పుడు మాత్రం తను పడిన బాధ కారణంగా మంటలు తెప్పించాడు. మొత్తానికి నోయెల్ అవినాష్, అమ్మలను వాయించేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com