విడాకులు తీసుకున్న సింగర్ నోయెల్, ఎస్తేర్ జంట
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లై కనీసం ఆరు నెలలు కూడా గడవక ముందే హీరోయిన్ ఎస్తేర్, సింగర్ నోయెల్ జంట విడిపోయింది. ‘1000 అబద్ధాలు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎస్తేర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘భీమవరం బుల్లోడు, ‘జయజానకి నాయక’, ‘గరం’ వంటి చిత్రాల్లో నటించింది. కాగా గతేడాది జనవరిలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది నెలలకే తామిద్దరం విడిపోయామని ఎస్తేర్ వెల్లడించింది. తమ మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది జూన్‌లోనే ఈ జంట విడాకులకు అప్లై చేసింది. కాగా తమకు తాజాగా విడాకులు మంజూరయ్యాయని ఎస్తేర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
గతేడాది నన్ను చాలా మంది అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెబుతున్నానని సోషల్ మీడియా వేదికగా ఎస్తేర్ తెలిపింది. అధికారికంగా మేము విడాకులు తీసుకున్నామని... లీగల్‌గా ఈ విషయంలో స్పష్టత వచ్చేవరకు ఎదురుచూసి.. ఇప్పుడు ప్రకటిస్తున్నానని తెలిపింది. 2019 జనవరి 3న నోయల్, తాను పెళ్లి చేసుకున్నామని వెల్లడించింది. ఆ తరువాత కొద్ది రోజులకే తమమధ్య మనస్పర్థలు వచ్చాయని... దీంతో విడిపోయి, గతేడాది జూన్‌లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. తాము వేసిన పిటిషన్‌పై కోర్టు నిన్న తీర్పును ఇచ్చిందని.. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని ఎస్తేర్ పేర్కొంది.
ఇంతకు ముందులాగే ఇప్పుడు నాకు మద్దతుగా ఉంటారని భావిస్తున్నానని ఎస్తేర్ తెలిపింది. మనం మనుషులమని.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటామని పేర్కొంది. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టమో అందరికీ తెలుసని... మా ఇద్దరికి సంబంధించి ఇదే తన క్లారిఫికేషన్ అని తెలిపింది. దయచేసి ఇక ఈ విషయంపై ఇంటర్వ్యూలో, కామెంట్లలో అడగకండని కోరింది. తనకు మద్దతు ఇచ్చినందుకు, తనకు సహాయం చేసినందుకు, తనను ఇష్టపడినందుకు ఎస్తేర్ అందరికీ ధన్యవాదాలు తెలిపింది. అని కామెంట్ పెట్టారు.
I am Officially Divorced.
— Noel (@mrnoelsean) September 1, 2020
Wishing Ester Noronha a great new life ahead!
God bless! pic.twitter.com/7vvx84DUge
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments