చిరంజీవి 150 వ చిత్రం ఎవరూ చూడరంటున్న ప్రముఖ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి ఇటీవల విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కోదండరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే...కామెడీ కథను ఎంచుకుంటాను. ఎందుకంటే..ఆయన బాడీ అంతా కామెడీతో నిండి ఉంటుంది. ఈరోజుల్లో రైతులకు అండగా ఉంటాను అంటూ సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం చూడరు అని వ్యాఖ్యానించారు. చిరంజీవితో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసిన సీనియర్ డైరెక్టర్...అది కూడా వివాదాలకు దూరంగా ఉండే కోదండరామిరెడ్డి.. చిరు గురించి ఇలా మాట్లాడడం ఏమిటి అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం షాకయ్యారు. దీంతో చిరు 150వ సినిమా పై కోదండరామిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.
ఈ వివాదస్పద వ్యాఖ్యల పై కోదండరామిరెడ్డి ఈరోజు ఓ ప్రముఖ దినపత్రికకు వివరణ ఇస్తూ....సోషల్ మీడియాలో, పలు న్యూస్ ఛానల్లో నేను చేసిన వ్యాఖ్యలు ప్రసారం చేసే వరకు నాకు తెలియదు. అవన్నీ చూసిన తర్వాత నేను అలా మాట్లాడానా..? అని చాలా బాధపడ్డాను. దేవుడి సాక్షిగా చెబుతున్నాను...నాకు తెలియకుండానే అలా మాట్లాడేసాను. చిరంజీవి గారితో నాకు మంచి అనుబంధం ఉంది. నేను కూడా ఫ్లాప్ సినిమాలు తీసాను. ఫలానా సినిమా చేస్తే జనం చూడరు అని చెప్పడానికి నేనేమీ దేవుణ్ణి కాదు. పొరపాటుగా మాట్లాడాను చిరంజీవి గార్కి, నిర్మాత చరణ్ కి, డైరెక్టర్ వినాయక్ కి, చిరంజీని అభిమానులకు సారీ చెబుతున్నాను అని తెలియచేసారు. ఆలోచించకుండా మాట్లాడడం ఎందుకూ..? ఆతర్వాత ఇలా బాధపడడం ఎందుకు..? అందుకనే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout