Nobel Prize:రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

2023 సంత్సరానికి గాను వివిధ విభాగాల్లో సోమవారం నుంచి నోబెల్ అవార్డులు ప్రకటిస్తున్న రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఇవాళ(బుధవారం) రసాయన శాస్త్రంలో అవార్డు ప్రకటించింది. కెమెస్ట్రీ విభాగంలో అమెరికా శాస్త్రవేత్తలు మౌంగి బవెండి, లూయిస్‌ బ్రూస్‌, అలెక్సీ ఎకిమోవ్‌లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. క్వాంటమ్ డాట్స్ కనుగొనడం, వాటిపై విశ్లేషణ ప్రయోగాలు చేసినందుకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు ప్రకటిస్తున్నట్లు స్వీడిష్ అకాడమి సెక్రటరీ జనరల్ హన్స్ ఎలెగ్రెన్ తెలిపారు. అతి సూక్ష్మమైన నానో పార్టికల్స్ అయిన క్వాంటమ్ డాట్స్‌ను టీవీలు, ఎల్.ఈ.డీ లైట్లు తదితర ఎలక్ట్రిక్ పరికరాలలో వినియోగిస్తున్నారు. అలాగే ట్యూమర్ కణాలను తొలగించేందుకు సైతం ఈ టెక్నాలజీ వాడుతున్నారని రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.

భౌతిక శాస్త్రంలోనూ ముగ్గురికి నోబెల్ అవార్డు..

2023 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ముగ్గురిని ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్త పెర్రీ అగోస్తిని, జర్మనీ శాస్త్రేవేత్త ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు నోబెల్ అవార్డు దక్కింది. అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేయడం, కాంతి తరంగాల ఆటోసెకెండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఇక సోమవారం వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ అవార్డు వరించింది.

ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుగా నోబెల్‌కు పేరు..

నోబెల్ అవార్డు వరించిన వారికి ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డులు ప్రదానం చేస్తారు. అదే రోజు వారికి నగదును కూడా అందజేస్తారు. ఈ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్(9,86,000 డాలర్లు) ప్రైజ్ మనీ అందించనున్నారు. 2012లో 10 మిలియన్ క్రౌన్స్ నుంచి 8 మిలియన్ క్రౌన్స్‌కు ప్రైజ్ మనీని తగ్గించారు. అయితే 2017లో 9 మిలియన్ క్రౌన్స్ చేయగా.. 2020లో 10 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. ఇప్పుడు దానిని 11 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. 1896లో కన్నుమూసిన ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో 1901లో నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పురస్కారాలను ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుగా దీనిని పరిగణిస్తారు.

More News

Devara:జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. దేవర గురించి సూపర్ అప్టేడ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుకు అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ.

Nara Lokesh:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈనెల 12వరకు లోకేశ్ ముందస్తు బెయిల్ పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో

Ramcharan:మిస్టర్ కూల్ ధోనీని కలిసిన రామ్‌చరణ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్..

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో

Bandi Sanjay:ప్రధాని మోదీ వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో చీలిక వచ్చింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

Vande Bharat :వందేభారత్ స్లీపర్ కోచ్‌ల డిజైన్లు విడుదల.. 2024 మొదట్లో అందుబాటులోకి..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు పట్టాలపై తిరుగుతున్నాయి.