Nobel Peace Prize: జైలులో మగ్గుతున్న మానవ హక్కుల కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి
Send us your feedback to audioarticles@vaarta.com
2023 సంవత్సరానికి గానూ వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి నోబెల్ బహుమతులు ప్రకటిస్తు్న్న సంగతి తెలిసిందే. ఇప్పటికై వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం రంగాల్లో నోబెల్ బహుమతులను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. తాజాగా నోబెల్ శాంతి బహుమతిని వెల్లడించింది. ఇరాన్ దేశానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్ మహమ్మదికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గుర్తుగా ఆమెకు శాంతి బహుమతి అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉమెన్-లైఫ్-ఫ్రీడం నినాదాలతో పెద్ద ఉద్యమాన్ని నడిపిని నార్గెస్..
గతేడాది ఇరాన్లో హిజాబ్ సరిగా ధరించలేదని.. 22 ఏళ్ల మహ్సా జినా అమ్నీని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.. ఈ ఘటన ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది. ఇరాన్లో కొనసాగుతున్న మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా లక్షలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు- జీవితం-స్వేచ్ఛ(ఉమెన్-లైఫ్-ఫ్రీడం) అనే నినాదాలతో నార్గెస్ మహమ్మది పెద్ద ఉద్యమాన్ని నడిపారు.
31 ఏళ్ల జైలు శిక్ష.. 154 కొరఢా దెబ్బలు..
అంతేకాకుండా మానవ హక్కుల సాధన కోసం నార్గెస్ ఎన్నో కఠినమైన పోరాటాలు చేశారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు 13 సార్లు అరెస్ట్ చేశారు. అందులో 5 కేసుల్లో దోషిగా తేలారు. దీంతో అన్ని కేసుల్లో కలిపి 31 ఏళ్ల జైలు శిక్ష విధించారు. జైలు శిక్షతోపాటు 154 కొరఢా దెబ్బలు కూడా తిన్నారు. ప్రస్తుతం ఈ కేసుల్లో నార్గెస్ మహమ్మది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె జైలులో ఉండగానే నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments