ఆ వార్తల్లో నిజం లేదట
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం విశాల్ శేఖర్ సంగీతమందిస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'యాంట్‌వోన్ ఫిషర్' చిత్రానికి కాపీ వెర్షన్ అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.తాజా చిత్ర యూనిట్ ఈ కథనాలను ఖండించింది. తమ చిత్రానికి, 'యాంట్‌వోన్ ఫిషర్'కు ఎలాంటి సంబంధం లేదని చిత్ర బృందం పేర్కొంటోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా.. అల్లు అర్జున్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. అర్జున్, శరత్ కుమార్, రావు రమేష్, నాజర్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com