శ‌ర్వానంద్ పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు..!

  • IndiaGlitz, [Saturday,September 24 2016]

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌త‌మానంభ‌వ‌తి సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు సినిమాలో శ‌ర్వానంద్ న‌టిస్తున్నాడు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే మాకు అందిన స‌మాచారం ప్ర‌కారం...కాట‌మ‌రాయుడు సినిమాలో శ‌ర్వానంద్ న‌టించ‌డం లేదు. ఈ విష‌యాన్ని శ‌ర్వానంద్ స‌న్నిహితులు కూడా క‌న్ ఫ‌ర్మ్ చేసారు. శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం శ‌త‌మానంభ‌వ‌తి సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.