టీడీపీలో ఈ సిట్టింగ్‌లకు ‘నో’ టికెట్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధిపతి, ఏపీ సీఎం చంద్రబాబు ‘సైకిల్’ స్పీడ్ పెంచారు. ఈసారి కూడా 2014 ఎన్నికల్లో లాగే ‘ఫ్యాన్’ పార్టీని దెబ్బతీయాలని వ్యూహాలు.. ఎత్తులు వేస్తున్నారు. అయితే ఇవి మాత్రం సక్సెస్ అవుతాయ్ అన్నది గత కొన్ని రోజులుగా రాజకీయ పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. జిల్లాల వారిగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న ఆయన సిట్టింగ్‌లు మొదలుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలకు షాక్‌లిస్తున్నారు. కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అయితే టికెట్ ఇచ్చేది లేదు.. పార్టీలో ఉన్నా సరే.. లేకుంటే మీ దారి మీరు చూసుకున్నా సరేనని తేల్చిచెప్పేశారట.
వైసీపీ నుంచి మొత్తం 23 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల ప్రకటన ప్రారంభించడంతో మా టికెట్ సంగతేంటి సార్.. అని అమరావతిలోని చంద్రబాబు ఇంటి చుట్టూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రదిక్షణలు చేస్తున్నారట. అయితే తన సర్వేలో ఎవరైతే పక్కాగా గెలుస్తారని తేలిందో వారికి మాత్రమే ఇస్తానని తేల్చిచెప్పేశారట. అంతేకాదు.. పార్టీలో ఉండి బలోపేతం చేస్తే రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని కచ్చితంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేశారట.
వీరందరికీ నో టికెట్స్..
వీరిలో... పాతపట్నం ఎమ్మెల్యే- కలమట వెంకట రమణ, పాడేరు-ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం-ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే- వరుపుల సుబ్బారావు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే- జలీల్‌ఖాన్, యర్రగొండపాలెం – డేవిడ్‌రాజు, శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కోడుమూరు- మణిగాంధీ, కదిరి- చాంద్ బాషా, బద్వేలు -జయరాములు, పామర్రు ఎమ్మెల్యే- ఉప్పులేటి కల్పన తదితరులు ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంపీల విషయానికొస్తే.. కర్నూలు ఎంపీ- బుట్టా రేణుక, నంద్యాల ఎంపీ- ఎస్పీవై రెడ్డికి నో టికెట్స్ అని బాబు ప్రకటించేశారట.
అంతేకాదు టీడీపీ బీఫామ్‌తో గెలిచిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వట్లేదట. మరీముఖ్యంగా ఎవరైతే డబుల్ గేమ్ డ్రామాలాడుతున్నారో వారిని ముందే పసిగట్టిన చంద్రబాబు వాళ్లంతకు వాళ్లే పార్టీ మారేలా లోలోన పని కానిచ్చేస్తున్నారట. మరోవైపు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన సిట్టింగ్‌లకు చీరాల ఆమంచి కృష్ణమోహన్‌కు.. భీమిలి అవంతి శ్రీనివాస్ ఇలా జగన్ ప్రకటనలు చేసేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో వీళ్లంతా వారివారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారారా..? లేకుంటే టీడీపీ నుంచి వచ్చే కాసులకు కక్కుర్తి పడి వెళ్లారా అన్నది ఇక్కడ అప్రస్తుతం. పార్టీలో చేరేటప్పుడు మాత్రం కచ్చితంగా రానున్న ఎన్నికల్లో టికెట్ ఇస్తామని గట్టిగానే భరోసా ఇచ్చారన్నది మాత్రం బహిర్గతమవుతోంది. చూశారు కదా.. అటు సొంత పార్టీలోకి వెళ్లలేక.. టికెట్ ఇవ్వని టీడీపీ పార్టీలో ఉండలేక వీరి పరిస్థితి అల్లకల్లోల్లంగా తయారైందని విమర్శకులు, విశ్లేషకులు చెబుతున్నారు. అయితే టికెట్ రాని వీరందరి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments