అన్నం ముట్టని చిదంబరం.. ‘చెప్పలేను’.. ‘తెలీదు’ అంతే!
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన విషయం విదితమే. అర్ధరాత్రి 12 గంటలు అయినప్పటికీ ఆయన అన్నం ముట్టుకోలేదట. 12 గంటల తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు 20 ప్రశ్నలు సంధించారని సమాచారం. దీంతో రాత్రంతా నో నిద్ర, నో ఫుడ్ అన్న మాట. అంతేకాకుండా గురువారం ఉదయం కూడా మరో దఫా ప్రశ్నించారు. మొత్తం రెండు దఫాలుగా సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.
‘చెప్పలేను’.. ‘తెలీదు’ అంతే!
అయితే.. మొదటి దఫా ప్రశ్నావళికి ముందు భోజనం చేయాలని సీబీఐ అధికారులు సూచించినప్పటికీ.. చిదంబరం వద్దని తిరస్కరించారని సమాచారం. రంగంలోకి దిగిన అధికారులు సుమారు 20 కీలక ప్రశ్నలను సంధించారని తెలిసింది. అధికారులు ప్రశ్నలకు ‘చెప్పలేను’.. ‘స్పష్టంగా తెలీదు’ అనే సమాధానం ఇచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి.
బదిలీ దేనికి సంకేతం!
ఇదిలా ఉంటే.. చిదంబరం నిందితుడిగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా కేసును విచారిస్తున్న ఈడీ అధికారి రాకేశ్ అహూజా తిరిగి ఢిల్లీ పోలీస్ విభాగంలోకి బదిలీ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిదంబరాన్ని అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఆయన బదిలీ వ్యవహారం తెరమీదికి రావడం గమనార్హం. వాస్తవానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో అహూజా పదవీకాలం మూడు వారాల క్రితమే ముగిసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ బదిలీ దేనికి సంకేతమో పైనున్న పెరుమాళ్లకు తెలియాలి.
ప్రత్యేక కోర్టుకు చిదంబరం!
గురువారం 3:30 గంటల ప్రాంతంలో చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. పటిష్ట భద్రత మధ్య కోర్టుకు చేర్చారు. చిదంబరాన్ని 14 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం. ఆయనకు బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ సింఘ్వీ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫైనల్‌గా చిద్దూ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments