అన్నం ముట్టని చిదంబరం.. ‘చెప్పలేను’.. ‘తెలీదు’ అంతే!

  • IndiaGlitz, [Thursday,August 22 2019]

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం‌ను బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన విషయం విదితమే. అర్ధరాత్రి 12 గంటలు అయినప్పటికీ ఆయన అన్నం ముట్టుకోలేదట. 12 గంటల తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు 20 ప్రశ్నలు సంధించారని సమాచారం. దీంతో రాత్రంతా నో నిద్ర, నో ఫుడ్ అన్న మాట. అంతేకాకుండా గురువారం ఉదయం కూడా మరో దఫా ప్రశ్నించారు. మొత్తం రెండు దఫాలుగా సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.

‘చెప్పలేను’.. ‘తెలీదు’ అంతే!
అయితే.. మొదటి దఫా ప్రశ్నావళికి ముందు భోజనం చేయాలని సీబీఐ అధికారులు సూచించినప్పటికీ.. చిదంబరం వద్దని తిరస్కరించారని సమాచారం. రంగంలోకి దిగిన అధికారులు సుమారు 20 కీలక ప్రశ్నలను సంధించారని తెలిసింది. అధికారులు ప్రశ్నలకు ‘చెప్పలేను’.. ‘స్పష్టంగా తెలీదు’ అనే సమాధానం ఇచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి.

బదిలీ దేనికి సంకేతం!
ఇదిలా ఉంటే.. చిదంబరం నిందితుడిగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా కేసును విచారిస్తున్న ఈడీ అధికారి రాకేశ్ అహూజా తిరిగి ఢిల్లీ పోలీస్ విభాగంలోకి బదిలీ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిదంబరాన్ని అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఆయన బదిలీ వ్యవహారం తెరమీదికి రావడం గమనార్హం. వాస్తవానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో అహూజా పదవీకాలం మూడు వారాల క్రితమే ముగిసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ బదిలీ దేనికి సంకేతమో పైనున్న పెరుమాళ్లకు తెలియాలి.

ప్రత్యేక కోర్టుకు చిదంబరం!
గురువారం 3:30 గంటల ప్రాంతంలో చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. పటిష్ట భద్రత మధ్య కోర్టుకు చేర్చారు. చిదంబరాన్ని 14 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం. ఆయనకు బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ సింఘ్వీ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫైనల్‌గా చిద్దూ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.

More News

‘సైరా’ విషయంలో నయన్ ఎందుకిలా చేసింది!

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి టైటిల్ ఖ‌రారు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుందనే సంగ‌తి తెలిసిందే.

ఇది ఇక్కడితో ఆగదు..  పిచ్చా.. శని అనుకోవాలా!?

పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టులో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసిన విషయం విదితమే.

'పిహిల్వాన్' ట్రైల‌ర్ విడుద‌ల‌... సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

శాండిల్ వుడ్ బాద్షా..`ఈగ` ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు.

శివ కంఠమనేని హీరో గా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా

‘అక్కడొకడుంటాడు’తో శివ కంఠమనేని నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు.