Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. కస్టడీ పొడిగింపు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. నేటితో ఆయన కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరగా.. నాలుగు రోజులకు మాత్రమే కోర్టు అంగీకారం తెలిపింది. దీంతో ఏప్రిల్ 1వరకు ఆయన ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించగా.. కేజ్రీవాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు.
"ఈ కేసు గత రెండేళ్లుగా కొనసాగుతోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. అప్పుడు ECIR ఫైల్ చేశారు. తనపై ఇప్పటి వరకు ఆధారాలు చూపించలేదు. కానీ అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 31,000 పేజీల రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారని, స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నా వద్దకు ఎంతోమంది వస్తుంటారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నా ఇంటికి వచ్చారు. నాతో మాట్లాడారు. ఏవో పత్రాలు ఇచ్చారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తన ఫ్యామిలీ ట్రస్ట్ స్థాపన కోసం నన్ను కలవడానికి వచ్చారు. అనంతరం నాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఆ తర్వాత ఆయన కుమారుడు రాఘవ స్టేట్‌మెంట్ ఇవ్వగానే బెయిల్ వచ్చింది. సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడానికి ఈ ప్రకటనలు సరిపోతాయా? అసలు ఇందులోని రూ.100 కోట్లు ఏమయ్యాయి? అని ఇప్పటి వరకు తెలియరాలేదు" అని వాదించారు. అయితే ఈడీ విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను. దేశ ప్రజల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిమయమైందని చెప్పాలని చూస్తున్నారు. నా అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమే దీనికి ప్రజలే సమాధానం చెబుతారు" అని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగించారు.
అంతకుముందు ఈడీ అరెస్టు చేసినందున కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని సామాజికవేత్త సుర్జీత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేసింది. దీంతో కేజ్రీవాల్‌కు కాస్త ఊరట దక్కింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments