Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. కస్టడీ పొడిగింపు..

  • IndiaGlitz, [Thursday,March 28 2024]

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. నేటితో ఆయన కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరగా.. నాలుగు రోజులకు మాత్రమే కోర్టు అంగీకారం తెలిపింది. దీంతో ఏప్రిల్ 1వరకు ఆయన ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించగా.. కేజ్రీవాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు.

ఈ కేసు గత రెండేళ్లుగా కొనసాగుతోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. అప్పుడు ECIR ఫైల్ చేశారు. తనపై ఇప్పటి వరకు ఆధారాలు చూపించలేదు. కానీ అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 31,000 పేజీల రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారని, స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నా వద్దకు ఎంతోమంది వస్తుంటారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నా ఇంటికి వచ్చారు. నాతో మాట్లాడారు. ఏవో పత్రాలు ఇచ్చారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తన ఫ్యామిలీ ట్రస్ట్ స్థాపన కోసం నన్ను కలవడానికి వచ్చారు. అనంతరం నాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు.

ఆ తర్వాత ఆయన కుమారుడు రాఘవ స్టేట్‌మెంట్ ఇవ్వగానే బెయిల్ వచ్చింది. సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడానికి ఈ ప్రకటనలు సరిపోతాయా? అసలు ఇందులోని రూ.100 కోట్లు ఏమయ్యాయి? అని ఇప్పటి వరకు తెలియరాలేదు అని వాదించారు. అయితే ఈడీ విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను. దేశ ప్రజల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిమయమైందని చెప్పాలని చూస్తున్నారు. నా అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమే దీనికి ప్రజలే సమాధానం చెబుతారు అని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగించారు.

అంతకుముందు ఈడీ అరెస్టు చేసినందున కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని సామాజికవేత్త సుర్జీత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేసింది. దీంతో కేజ్రీవాల్‌కు కాస్త ఊరట దక్కింది.

More News

Siddharth-Adithi Rao: పెళ్లి వార్తలపై స్పందించిన సిద్దార్థ్, అదితిరావు.. ఏమన్నారంటే..?

సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నారు. అందుకు తగ్గట్లే వీరిద్దరూ కలిసి విహారయాత్రల్లో మునిగితేలుతున్నారు.

Vijayawada: హాట్‌హాట్‌గా బెజవాడ రాజకీయాలు.. దుర్గమ్మ క్షేత్రంలో విజయం ఎవరిది..?

రాజకీయ చైతన్యంగా పేరుగాంచిన బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దుర్గమ్మ కొలువైన ప్రాంతం కావడంతో విజయవాడ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా ఉంటాయి.

Manchu Manoj: పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్ .. మంచు మనోజ్ వ్యాఖ్యలు వైరల్..

ఏపీ రాజకీయాల గురించి సినీ హీరో మంచు మనోజ్ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ శిల్పకళావేదికలో

Ram Charan:డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలు

RRR చిత్రంతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.

BJP leader Laxman:ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి.. బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్..

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు తాము కూడా ట్యాపింగ్ బాధితులం అంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.