Re Polling:రీపోలింగ్‌కు అవకాశం లేదు.. 70.79శాతం పోలింగ్ నమోదు: సీఈవో

  • IndiaGlitz, [Friday,December 01 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.79% పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ మూడు శాతం తగ్గిందని పేర్కొ్‌న్నారు. అలాగే రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక డిసెంబర్‌ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తామని.. 8.30గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు చేపడతామన్నారు. ఉదయం 10గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56% పోలింగ్‌ నమోదైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 16,005 మంది వృద్ధులు, 9,459 మంది దివ్యాంగులు హోం ఓటింగ్ ఉపయోగించుకున్నారని.. 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని వివరించారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7,591 కేంద్రాల వెలుపల సీసీ టీవీ సదుపాయం కల్పించామన్నారు.

లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందన్నారు. 40 కంపెనీల బలగాలతో భద్రత కల్పిస్తున్నామని.. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయన్నారు. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారన్నారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి 2018లో 2,400 కేసులు నమోదైతే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదయ్యాయన్నారు. కొందరు మంత్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని వికాస్‌రాజ్‌ చెప్పుకొచ్చారు.

More News

NagarjunaSagar:సాగర్ వద్ద ఆగని ఉద్రిక్తత.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్యాం వద్ద ఇప్పటికే ఏపీ పోలీసులు భారీగా మోహరించగా..

America:అమెరికాలో నరరూప రాక్షసులుగా మారిన తెలుగు వ్యక్తులు

బంగారు భవిష్యత్ కోసం ఎంతో కష్టపడి అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక వారి బుద్ధి మారింది.

7 kg Gold:బ్యాంకులో 7కిలోల బంగారం మాయం.. మహిళా ఉద్యోగిని సూసైడ్..

వివిధ అవసరాల కోసం బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. దీంతో కస్టమర్స్ తీవ్ర ఆందోళనకు దిగారు.

AP Holidays:ఏపీలో వచ్చే ఏడాది సెలవులు ఇవే..

వచ్చే ఏడాది సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Hung:తెలంగాణలో హంగ్ వస్తే పరిస్థితేంటి.. ఎవరు ఏ పార్టీతో కలుస్తారు..?

దాదాపు రెండు నెలలుగా జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రక్రియ గురువారంతో ముగిసింది. అయితే ఈసారి రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.