Re Polling:రీపోలింగ్‌కు అవకాశం లేదు.. 70.79శాతం పోలింగ్ నమోదు: సీఈవో
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.79% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ మూడు శాతం తగ్గిందని పేర్కొ్న్నారు. అలాగే రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తామని.. 8.30గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు చేపడతామన్నారు. ఉదయం 10గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56% పోలింగ్ నమోదైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 16,005 మంది వృద్ధులు, 9,459 మంది దివ్యాంగులు హోం ఓటింగ్ ఉపయోగించుకున్నారని.. 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని వివరించారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7,591 కేంద్రాల వెలుపల సీసీ టీవీ సదుపాయం కల్పించామన్నారు.
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందన్నారు. 40 కంపెనీల బలగాలతో భద్రత కల్పిస్తున్నామని.. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయన్నారు. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారన్నారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి 2018లో 2,400 కేసులు నమోదైతే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదయ్యాయన్నారు. కొందరు మంత్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని వికాస్‌రాజ్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments