ధనుష్ కి దెబ్బేసిన నిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
రజనీకాంత్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు అల్లుడు ధనుష్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడు. గతేడాది జనవరి 1న విడుదల చేసిన రఘవరన్ బి.టెక్`(తమిళంలో వేల ఇల్లాద పట్టదారి) తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ధనుష్ తెలుగు మార్కెట్ పై కూడా కన్నేశాడు.
తమిళంలో రఘవరన్ బి.టెక్ దర్శకుడు వేల్ రాజ్ దర్శకత్వంలో రూపొందించిన తంగమగన్` చిత్రాన్ని తెలుగులో నవమన్మథుడు` పేరుతో బృందావన్ పిక్చర్స్ బ్యానర్ ఎన్.వెంకటేష్, ఎన్.రవికాంత్ లు విడుదల చేయడానికి ఇచ్చాడు. కానీ నిర్మాతలు సరైన ప్లానింగ్ లేకపోవడంతో సినిమా హైదరాబాద్ లో నాలుగు చోట్లే బుకింగ్ కనపడింది. థియేటర్స్ కు వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. మొత్తం మీద సినిమాను ప్లానింగ్ లేకుండా చేయడంతో నిర్మాతలు ఇన్ డైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే ధనుష్ కు దెబ్బేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout