ధనుష్ కి దెబ్బేసిన నిర్మాతలు

  • IndiaGlitz, [Friday,December 18 2015]

రజనీకాంత్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు అల్లుడు ధనుష్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడు. గతేడాది జనవరి 1న విడుదల చేసిన రఘవరన్ బి.టెక్'(తమిళంలో వేల ఇల్లాద పట్టదారి) తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ధనుష్ తెలుగు మార్కెట్ పై కూడా కన్నేశాడు.

తమిళంలో రఘవరన్ బి.టెక్ దర్శకుడు వేల్ రాజ్ దర్శకత్వంలో రూపొందించిన తంగమగన్' చిత్రాన్ని తెలుగులో నవమన్మథుడు' పేరుతో బృందావన్ పిక్చర్స్ బ్యానర్ ఎన్.వెంకటేష్, ఎన్.రవికాంత్ లు విడుదల చేయడానికి ఇచ్చాడు. కానీ నిర్మాతలు సరైన ప్లానింగ్ లేకపోవడంతో సినిమా హైదరాబాద్ లో నాలుగు చోట్లే బుకింగ్ కనపడింది. థియేటర్స్ కు వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. మొత్తం మీద సినిమాను ప్లానింగ్ లేకుండా చేయడంతో నిర్మాతలు ఇన్ డైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే ధనుష్ కు దెబ్బేశారు.

More News

చిరు 150వ మూవీని నిర్మిస్తున్న భారీ నిర్మాణ సంస్థ‌..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రిలో చిరు 150వ సినిమా ప్రారంభిస్తార‌ని చిరు త‌న‌యుడు చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు.

రానా కొత్త చిత్రం

ద‌గ్గుబాటి రానా ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

పాట త‌ర్వాతే మాట అంటున్న ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నతాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.

వైజాగ్ లో షెడ్యూల్ పూర్తిచేసుకున్న- సునిల్ చిత్రం

న‌టుడుగా ఎన్నో వైవిద్య‌మైన పాత్ర‌ల‌తో న‌వ్వించి, హీరోగా సూప‌ర్ స‌క్సస్ లు సాధించిన సునీల్ హీరోగా, జిద్ చిత్రంతో బాలీవుడ్ కుర్ర‌కారు హుషారెక్కించిన మ‌నార్ చోప్రా హీరోయిన్ గా, ర‌క్ష లాంటి టెర్రిఫిక్ క‌థాంశంతో విమ‌ర్శ‌కుల

ప్ర‌భాస్ బెస్ట్ విషెష్ అందుకున్న'భ‌లేమంచిరోజు'

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటే అభిమానుల‌కే కాకుండా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికి చాలా ఇష్టం.