టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు: మాధవీలత సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌పై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగనే జరగవని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఎన్సీబీ అధికారులు టాలీవుడ్‌పై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. సుశాంత్ కేసులో ఎన్సీబీ అడుగుపెట్టడం స్వాగతిస్తూనే టాలీవుడ్‌పై దృష్టి పెట్టాలని మాధవీలత కోరారు. బాలీవుడ్ డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నమాట నిజమేనని మాధవీలత పేర్కొన్నారు. అదే విధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైతం డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉందన్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయమై మాధవీలత మాట్లాడుతూ.. ‘‘సుశాంత్ కేసులో అడుగు పెట్టడం మంచిందే. ఎందుకంటే అంత బడా బాబులే కదా. అందులోనూ సినిమారంగం ఇప్పటికే చెడ్డపేరు అంటగట్టుకుంది. ఒక పేదవాడికి అన్నం పెడతారో లేదో డ్రగ్స్‌కి 1 ప్యాకెట్ అంటారా గ్రాములు అంటారా? ఏదో దానికి వేలు పెడతారు సరే అది వాళ్ల ఇష్టం. ఇండియాలో పర్మిషన్ ఉన్నవి తినండి తాగండి. దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి కానీ.. ఇతర దేశాల మాదక ద్రవ్యాలు ఎందుకు?ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరూ బయట పెట్టరు.
అది సరే కానీ తెలంగాణ ఎన్సీబీ సార్లు మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. సీత కన్ను పీత కన్నూ కాకుండా సీరియస్ కన్ను వేయండి. మన ఇండస్ట్రీలో బాగా వాడుకలో ఉంది. అది లేకుండా పార్టీలు జరగవు ఇక్కడ. 2009లో వచ్చారు.. పొలిటికల్ అండతో వెనక్కి పోపయారు. పాపం డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కి పడేశారు. చట్టానికి చేతులు చాలా పెద్దవి. అందుకే అవి చాచితే విరగ్గొడతారు. చాలా దారుణాలు జరుగుతున్నాయి మత్తులో..’’ అని మాధవీలత పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com