డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఎవ్వరినీ వదలం!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసులో హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ల, ఆర్టిస్టులందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మంగళవారం రోజు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మొత్తం ఓ ఎన్జీవో సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో తెలంగాణ పోలీసు శాఖ, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. డ్రగ్స్ కేసు అని హంగామా చేసేది పోలీసులే.. మళ్లీ క్లీన్ చిట్ ఇచ్చేది వాళ్లే అసలేం జరుగుతోంది..? అంటూ జనాలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించారు.
డ్రగ్స్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన నటీనటులెవ్వరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ అధికారులు తేల్చిచెప్పారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ 62 మందిని విచారించినప్పటికీ.. ఇంకా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఛార్జి షీట్ వ్యవహారాలు ఇలా పలు రకాలుగా వచ్చిన కథాలన్నీ అబద్ధమేనని.. అవాస్తవాలను నమ్మకండి అని అధికారులు స్పష్టం చేశారు.
కాగా.. ఈ కేసులో ఇప్పటివరకూ ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, వాటిలో ఐదుకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని.. ఇంకా పలు ఆధారాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా.. మాకు లభించిన ఆధారాలన్నీ ఎప్పటికప్పుడూ అభియోగ పత్రాలను దాఖలు చేసి కోర్టు సమర్పిస్తున్నామని అంతేకానీ.. క్లీన్ చిట్ ఇచ్చామన్నది అవాస్తవం అన్నారు. ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారిలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలే ప్రసక్తే లేదని.. కచ్చితంగా పూర్తి ఆధారాలతో ముందుకెళ్తున్నామని ఎక్సైజ్ అధికారులు తేల్చిచెప్పారు. సో.. మొత్తానికి చూస్తే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు ఎక్సైజ్ శాఖ స్పందించి క్లారిటీ ఇచ్చేసింది.
కాగా.. క్లీన్ చిట్ ఇచ్చినట్లు మంగళవారం రోజు వార్త విన్న ఈ కేసులోని టాలీవుడ్ దర్శకులు, హీరోలు, హీరోయిన్స్ ఆనందంలో మునిగి తేలారు. అయితే ఇవాళ ఎక్సైజ్ ప్రకటనతో మరోసారి వారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, శ్యామ్ కే. నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్, హీరో నవదీప్, నవపాద ధర్మారావ్(చిన్నా), నటి ఛార్మీ కౌర్, నటి ముమైత్ ఖాన్, హీరో రవితేజ, శ్రీనివాస్ (రవితేజ కారు డ్రైవర్), యంగ్ హీరో తనీష్, హీరో నందుతో పాటు పలువురు ప్రముఖులను విచారించిన కొన్ని నెలలపాటు సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.
వీళ్లలో కొందరు అందుబాటులో లేనప్పటికీ ఎక్కడున్నా సరే వచ్చి తీరాల్సిందేనని రప్పించి మరీ విచారణ జరిపారు. వారి నుంచి గోళ్లు, వెంట్రుకలతో పాటు శాంపిల్స్ సేకరించడమే కాకుండా వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. సో.. ఈ వ్యవహారం మున్ముంథు మళ్లీ తెరమీదికొచ్చి.. టాలీవుడ్‌ను రెండోసారి ఓ కుదుపు కుదిపేందుకు రెడీ అవుతోందన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com