ఈ ఒక్క పనిచేస్తే.. చంద్రబాబుకు ఎవ్వరూ ఓటెయ్యరు!

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండని కార్యకర్తలకు, నేతలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్ర ముగింపు రోజున భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరగడమే కాకుండా.. కార్యకర్తలు, పార్టీ నేతలకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.ఈ నవరత్నాలను జనాల్లోకి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. జనం ఓటు వేయరన్నారు.

ఆరు నెలలు కలిసి ఉంటే.. వారు వీరు.. వీరు వారవుతారని జగన్ సెటైరికల్‌‌గా మాట్లాడారు. ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని జగన్ చెప్పారు. ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉందని.. ఇప్పుడు తాను చేసే యుద్ధం ఒక్క నారాసురుడితో మాత్రమే కాదని.. ఎల్లోమీడియాతో కూడా అని మీరంతా తోడుగా ఉంటే కచ్చితంగా జయిస్తానని జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ చెబుతున్నట్లుగా నవరత్నాలు అనే ఒక్క పనిని పార్టీ శ్రేణులు ఎంత వరకు జనాల్లోకి తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే.

చిత్తవుతాయా.. చిత్తు చేస్తాయా..!?

జగన్ చెబుతున్నట్లుగా ఈ నవరత్నాలు జనాల్లోకి తీసుకెళ్తే అవి ఏ మాత్రం పనిచేస్తాయ్..? జగన్‌కు ఏ మేరకు ఓట్లు సంపాదించిపెడ్తాయ్..? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలో అందరికంటే నేనే సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుల ముందు ఈ నవరత్నాలు చిత్తవుతాయా..? బాబు ఎత్తులను చిత్తు చేస్తాయో..? తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే మరి.

More News

జగన్ పాదయాత్ర ముగింపులో గోవిందా.. గోవిందా!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి పాదయాత్ర ముగింపు రోజున కీలక ప్రసంగం చేశారు.

ఓటమికి దగ్గరగా టీడీపీ.. వైసీపీదే గెలుపు..!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని.. అందుకే ఆయన ఓటమికి దగ్గరగా ఉన్నారని..

బాలయ్యపై లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడైన ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి.. హీరో బాలకృష్ణను మెచ్చుకున్నారు.

రేవంత్‌‌ రెడ్డికి మరో కోలుకోలేని షాక్..!

తెలంగాణ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో కొడంగల్‌‌లో ఘోరంగా ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వరుస షాక్‌లు వెంటాడుతున్నాయి.

వైఎస్ జగన్ పాదయాత్ర సక్సెస్‌‌కు కారణమిదే..

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' నేటితో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగియనుంది.