KCR:మీకు దండం పెడతా.. పరామర్శకు ఎవరూ రావొద్దు: కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించేందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆసుపత్రికి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను పరామర్శించేందుకు ఎవరు ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. "ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాది, వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌తో యశోద హాస్పిటల్లో చేరాను. ఈ సందర్భంలో వైద్య బృందం నన్ను సీరియస్‌గా హెచ్చరించింది. అదేంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి. దాంతో నెలల తరబడి బయటకు పోలేరని చెబుతున్నారు. దాన్ని గమనించి, దయచేసి మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరందరూ బాధపడకుండా మీ స్వస్థలాలకు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి వెళ్లాలి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంకో పది రోజుల వరకు ఎవరూ కూడా తరలిరావొద్దని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. హాస్పిటల్లో మనం కాకుండా వందలాది మంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ల క్షేమం కూడా మనకు ముఖ్యం. కాబట్టి మీరు అన్యదగా భావించకుండా, క్రమశిక్షణతో మీ ఇళ్లకు చేరండి. మంచిగ అయిన తర్వాత నేను ప్రజల మధ్యన ఉండేవాన్నే కాబట్టి, మనం కలుసుకుందాం. దానికి ఇబ్బంది లేదు. దయచేసి నా కోరికను మన్నించి, నా మాటను గౌరవించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా విజ్ఞప్తిని మీరు తప్పకుండా మన్నిస్తారని భావిస్తున్నాను" కేసీఆర్ తెలిపారు.
కాగా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ మంత్రులు, ఇతర పార్టీల సీనియర్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు తదితరులు ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments