KCR:మీకు దండం పెడతా.. పరామర్శకు ఎవరూ రావొద్దు: కేసీఆర్

  • IndiaGlitz, [Tuesday,December 12 2023]

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించేందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆసుపత్రికి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను పరామర్శించేందుకు ఎవరు ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వంద‌లాది, వేలాదిగా తరలివచ్చిన అభిమానులంద‌రికీ నా హృద‌య‌పూర్వక వంద‌నాలు. అనుకోకుండా జ‌రిగిన యాక్సిడెంట్‌తో య‌శోద హాస్పిట‌ల్‌లో చేరాను. ఈ సంద‌ర్భంలో వైద్య బృందం న‌న్ను సీరియ‌స్‌గా హెచ్చరించింది. అదేంటంటే ఇన్‌ఫెక్షన్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. దాంతో స‌మ‌స్య ఇంకా పెరిగి చాలా అవ‌స్థలు వ‌స్తాయి. దాంతో నెల‌ల త‌ర‌బ‌డి బ‌య‌ట‌కు పోలేర‌ని చెబుతున్నారు. దాన్ని గ‌మ‌నించి, ద‌య‌చేసి మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరంద‌రూ బాధ‌ప‌డ‌కుండా మీ స్వస్థలాల‌కు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి వెళ్లాలి.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంకో ప‌ది రోజుల వ‌ర‌కు ఎవ‌రూ కూడా త‌ర‌లిరావొద్దని విన‌య‌పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. హాస్పిట‌ల్‌లో మ‌నం కాకుండా వంద‌లాది మంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ల క్షేమం కూడా మ‌న‌కు ముఖ్యం. కాబ‌ట్టి మీరు అన్యదగా భావించ‌కుండా, క్రమ‌శిక్షణ‌తో మీ ఇళ్లకు చేరండి. మంచిగ అయిన త‌ర్వాత నేను ప్రజ‌ల మ‌ధ్యన ఉండేవాన్నే కాబ‌ట్టి, మ‌నం క‌లుసుకుందాం. దానికి ఇబ్బంది లేదు. ద‌య‌చేసి నా కోరిక‌ను మ‌న్నించి, నా మాట‌ను గౌర‌వించి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేస్తున్నాను. నా విజ్ఞప్తిని మీరు త‌ప్పకుండా మ‌న్నిస్తారని భావిస్తున్నాను కేసీఆర్‌ తెలిపారు.

కాగా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ మంత్రులు, ఇతర పార్టీల సీనియర్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు తదితరులు ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే.

More News

Pawan Kalyan:పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అప్పటి దాకా ఆగాల్సిందే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. మొన్నటివరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన..

Holidays in Telangana:తెలంగాణలో వచ్చే ఏడాది సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

వచ్చే ఏడాదికి సంబంధించి సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 27 సాధారణ సెలవులు,

CP Srinivas Reddy:హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్‌రెడ్డి.. పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ..

పాలనలో తనదైన ముద్ర వేసేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు తన టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు.

TDP Leaders:వైసీపీ ఇంఛార్జ్‌ల మార్పుపై టీడీపీ నేతల సెటైర్లు

వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈసారి మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత జగన్

YSSRCP: అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు మార్పు..

ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అధికార వైసీపీ కదనరంగంలోకి దిగింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.