తెలంగాణలో కొత్త వేరియంట్ బారిన ఎవరూ పడలేదు: శ్రీనివాసరావు
Send us your feedback to audioarticles@vaarta.com
యూకే నుంచి సోమవారం ఏడుగురు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చారని.. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా.. ఈ నెల 15 -21 మధ్యలో 358 మంది యూకే నుంచి ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారన్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూకేలో డిటెక్ట్ అయిన కరోనా వైరస్ వేరియెంట్‌పై కేంద్రం సూచనలు వచ్చాయని శ్రీనివాసరావు వెల్లడించారు. గడిచిన వారం రోజుల్లో ఎవరైనా యూకే నుంచి హైదరాబాద్ లేదంటే తెలంగాణకు వచ్చి ఉంటే వారు 040-24651119 నంబర్‌కి ఫోన్ చేయాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొత్త కరోనా వెరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అయితే దీని కారణంగా మరణాలు చాలా తక్కువగా ఉన్నట్టు సమాచారం అందుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారని వెల్లడించారు. కాగా.. తెంగాణలో ఇప్పటి వరకూ కొత్త కరోనా వేరియంట్ బారిన ఒక్కరు కూడా పడలేదన్నారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్నారు. తెలంగాణలో రోజుకు 45 వేల నుంచి 50 వేల వరకూ టెస్టులు నిర్వహిస్తున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే చాలా తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. 4-5 వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందన్నారు. ప్రస్తుత తరుణంలో విందులు, వినోదాలు నిర్వహించవద్దని శ్రీనివాసరావు తెలిపారు.
కాగా.. కొత్త వైరస్‌లు వచ్చినప్పుడు మ్యుటేషన్‌ల వంటివి జరగడం సర్వ సాధారణమని.. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త వెరియెంట్ సోకిన వారు ఉంటే వారిని ప్రత్యేకంగా ఉంచి చికిత్సను అందిస్తామన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ కొత్త కరోనా వేరియంట్ సోకినవారు లేరన్నారు. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్‌లో ఉండటం మంచిదని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకను కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుపుకోవాలని సూచించారు. కొత్త వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇంతకు ముందు లాగే వారికి కూడా చికిత్సను అందిస్తామని రమేష్ రెడ్డి వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments