Pawan Kalyan Varahi : జనసేనానికి బిగ్ రిలీఫ్... 'వారాహి' అంతా పర్ఫెక్ట్, వివాదానికి తెరదించిన కేసీఆర్ సర్కార్

జనసేన (Janasena) అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రాష్ట్ర వ్యాప్త పర్యటనల కోసం వాహనాన్ని సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి వారాహి (Varahi) అని పేరు కూడా పెట్టారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. దానికి వారాహి కాకుండా నారాహి అని పేరు పెట్టుకోవాల్సిందని చురకలంటించారు. ఇంకొందరైతే.. ఈ వాహనానికి వినియోగించిన రంగును సామాన్యులు ఉపయోగించకూడదని, పవన్‌కి ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. దీనికి జనసేన పార్టీ నేతలు కూడా ధీటుగా బదులిచ్చారు. పవన్ జనంలోకి వెళితే తమ పరిస్ధితి ఏంటోనన్న భయంతోనే అధికార పార్టీ ఈ రకమైన వ్యాఖ్యల్ని చేస్తుందంటూ కౌంటరిచ్చారు.

వారాహి (Varahi) రంగుపై మాకు అభ్యంతరం లేదు :

ఇదిలావుండగా.. వారాహి వివాదానికి సంబంధించి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) క్లారిటీ ఇచ్చారు. వాహనాల రంగులకు కూడా కోడ్స్ వుంటాయని.. భారత సైన్యం ఉపయోగించే కలర్ కోడ్ 7B8165 కాగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తగా తయారు చేయించుకున్న వారాహి కలర్ కోడ్ 445c44 అని మంత్రి స్పష్టం చేశారు. ఈ రంగుపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పువ్వాడ తెలిపారు.

అది అలీవ్ గ్రీన్ కాదు.. ఎమరాల్డ్ గ్రీన్:

డిసెంబర్ 9న హైదరాబాద్ టోలిచౌకి ఆర్టీవో కార్యాలయంలో వారాహి రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యిందని, దీనికి TS13EX8384 నెంబర్ కేటాయించామని, రవాణా శాఖ నుంచి వారాహి వాహనానికి పూర్తి అనుమతులు వున్నాయని పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం వారాహిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామని ఆయన పేర్కొన్నారు. వారాహి రంగు అలీవ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావడంతో వారాహికి సంబంధించి పవన్ కల్యాణ్‌కు బిగ్ రిలీఫ్ లభించినట్లయ్యింది.

More News

Inaya Sultana Bigg Boss: బిగ్‌బాస్‌ షోతో బాగానే సంపాదించిన ఇనయా.. 14 వారాలకు ఎంతంటే..?

బిగ్‌బాస్‌ 6 తెలుగులో అందరికీ కనెక్ట్ అయిన కంటెస్టెంట్ ఇనయా సుల్తానా. టాప్ 5లో ఖచ్చితంగా వుంటుందని, వీలైతే విన్నర్‌గా కూడా నిలుస్తుందని అంతా భావించిన ఇనయా గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

'రుద్రంగి' సినిమా నుంచి గానవి లక్ష్మణ్ ఫస్ట్ లుక్ రిలీజ్

సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది 'రుద్రంగి'. ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్,

Pushpa 2 : రామరాజు వస్తే పుష్పరాజ్ ఒప్పుకుంటాడా ..?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది.

Mythri Movie Makers : మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ సోదాలు.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఇళ్లు , కార్యాలయాలపై రైడ్స్ జరుగుతున్నాయి.

tamanna bhatia : అది బ్రానా, టాపా... ఏంటో చెప్పమ్మా .. సెగలు రేపుతోన్న తమన్నా అందం

సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఐదేళ్లు, లేదా మంచి హిట్లు పడితే ఇంకో రెండేళ్లు అంతేకానీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని హీరోయిన్ల